హెల్త్ టిప్స్

ఈ 4 చిట్కాల‌ను పాటిస్తే జాయింట్ పెయిన్స్ ఇక మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్ట‌వు..!

ఈ రోజుల్లో వ‌య‌స్సు మీద ప‌డుతున్న వారిలో ప్ర‌ధానంగా క‌నిపించే స‌మ‌స్య కీళ్ల నొప్పులు. ఒకప్పుడు వయసుపెరిగే కొద్దీ ఈ నొప్పులు వచ్చేవి. కాని ఆధునిక జీవినశైలిలో మార్పులతో చిన్న వయసు వారు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చల్లని వాతావరణం కీళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. కీళ్ల నొప్పుల కోసం మెడికల్ స్టోర్స్‌లో అనేక మందులు, ఆయిల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, మీరు కొన్ని సాధారణ ఇంటి నివారణలతో ఈ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ముందుగా ప‌సుపు మ‌రియు పాలు. కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి.. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చెంచా పసుపు కలిపి తాగితే మంచిది. కీళ్ల వద్ద పసుపు నూనెతో మర్దనా చేసినా రిలీఫ్‌ ఉంటుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఫంగీసైడల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అర్థరైటిస్‌తో బాధపడేవారు అల్లం తీసుకుంటే.. కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు రెండూ తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం తీసుకుంటే.. శరీరంలో అధికంగా ఉన్న యూరిక్‌ యాసిడ్ తగ్గుతుంది. అల్లం నూనెను కీళ్లపై మసాజ్‌ చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.నిమ్మరసం మరియు ఆలివ్ నూనె మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ మిశ్రమం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒక టీస్పూన్ నిమ్మరసం మరియు ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

joint pains would not bother you follow these remedies

శుభ్రమైన గుడ్డను వేడి నీటిలో నానబెట్టి ఆ త‌ర్వాత దానిని పిండి నొప్పి ఉన్న ప్రదేశంలో రాయండి. ఇది రక్త ప్రసరణను పెంచడ‌మే కాకంఉడా వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. కీళ్లనొప్పులు తగ్గాలంటే టమాటోను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టొమాటోలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, విటమిన్ సి, పొటాషియం కూడా టమోటాలలో ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

Sam

Recent Posts