Juices For Beauty : వీటిని తీసుకుంటే చాలు.. మీ ముఖం రంగు అమాంతం మారి మెరిసిపోతుంది..!

Juices For Beauty : మ‌న శ‌రీర అవ‌య‌వాల‌ను క‌ప్పి ఉంచే చ‌ర్మం అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. చ‌ర్మ సౌంద‌ర్యాన్ని ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు కూడా. కానీ మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉన్నారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి ఎంత ఖ‌ర్చు చేసినప్ప‌టికి ఫ‌లితం లేక నిరుత్సాహ ప‌డుతూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే విష‌యాల‌ను పాటించ‌డం వ‌ల్ల చ‌ర్మ సౌంద‌ర్యాన్ని చాలా సుల‌భంగా మెరుగుప‌రుచుకోవ‌చ్చు. చ‌ర్మం అందంగా కాంతివంతంగా త‌యార‌వ్వాలంటే మ‌నం రోజుకు 4 నుండి 5 లీట‌ర్ల నీటిని తాగాలి. కాలంతో సంబంధం లేకుండా రోజు త‌ప్ప‌కుండా నీటిని తాగాలి.

చాలా మంది నీరు తాగితే మూత్ర విసర్జ‌న‌కు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని నీరు తాగే విష‌యంలో అశ్ర‌ద్ద చేస్తూ ఉంటారు. నీటిని తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది. చ‌ర్మం పొడి బార‌కుండా ఉంటుంది. నీటిని తాగ‌డం వ‌ల్ల వాతావ‌ర‌ణ కాలుష్యం, వేడి, సూర్యుడి కిర‌ణాల నుండి చ‌ర్మం సంర‌క్షించ‌బ‌డుతుంది. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అందంగా క‌న‌బ‌డాల‌నుకునే వారు త‌ప్ప‌కుండా నీటిని ఎక్కువ‌గా తాగాలి. అలాగే చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ పోష‌కాలు అందేలా మ‌నం 2 ర‌కాల జ్యూస్ ల‌ను త‌యారు చేసుకుని ఉద‌యం, సాయంత్రం తాగ‌డం వ‌ల్ల చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ అందుతాయి.

Juices For Beauty take daily for many benefits
Juices For Beauty

దీని కోసం 2 క్యారెట్స్ , 2 ట‌మాటాలు, ఒక కీర‌దోస‌, చిన్న బీట్ రూట్ ను ముక్క‌లుగా చేసి జార్ లో వేసి జ్యూస్ లా చేసుకోవాలి. త‌రువాత దీనిని వ‌డ‌క‌ట్ట‌గా వ‌చ్చిన జ్యూస్ లో నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపి తీసుకోవాలి. ఇలా రోజు ఉద‌యం తాగాలి. ఈ జ్యూస్ ను తాగిన అర‌గంట త‌రువాత ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో బ‌త్తాయి, ఫైనాఫిల్, క‌మ‌లా పండ్ల‌తో చేసిన జ్యూస్ ల‌ను తీసుకోవాలి. వీటిలో ఏదో ఒక జ్యూస్ ను 200 ఎమ్ ఎల్ మెతాదులో తీసుకోవాలి. ఇలా జ్యూస్ ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా తయార‌వుతుంది. చ‌ర్మం యొక్క రంగు కూడా మెరుగుప‌డుతుంది. చ‌ర్మ స‌మ‌స్యలు రాకుండా ఉంటాయి. అదే విధంగా ముఖం అందంగా క‌న‌బ‌డాల‌నుకునే వారు రాత్రి భోజ‌నంలో కేవ‌లం పండ్ల‌ను మాత్ర‌మే తీసుకోవాలి. ఈ పండ్ల‌ను కూడా సాయంత్రం 7 గంట‌ల లోపే తీసుకోవాలి.

ఇలా తీసుకోవ‌డం వల్ల చ‌ర్మ సంర‌క్ష‌ణ‌ల‌కు కావాల్సిన పోష‌కాల‌న్నీ అందుతాయి. చ‌ర్మ‌క‌ణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌లినాలు, మృత క‌ణాలు చ‌ర్మం పై పేరుకుపోకుండా చ‌క్క‌గా తొలగిపోతాయి. కాలుష్యం, ఎండ‌లో తిరగ‌డం వ‌ల్ల రంగు మారిన చ‌ర్మం తిరిగి సాధార‌ణ స్థితికి చేరుకుంటుంది. అలాగే చ‌ర్మానికి నేరుగా ఎండ త‌గ‌ల‌కుండా చూసుకోవాలి. ఎండ‌లో బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు శ‌రీరం నిండుగా అలాగే కాట‌న్ దుస్తుల‌ను ధ‌రించ‌డం మంచిది. ఈ విధంగా నీటిని ఎక్కువ‌గా తాగుతూ ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా మ‌నం మ‌న ముఖ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts