Kalonji Seeds : కలోంజి గింజలు.. నల్లగా, చిన్నగా ఉండే ఈ గింజలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో ఈ గింజలు మనకు ఎంతగానో సహాయపడతాయి. వీటిలో ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. ఆయుర్వేద నిపుణులు కాలోంజి గింజలను కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. కాలోంజి గింజలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. కాలోంజి గింజలను తీసుకోవడం వల్ల మన శరీరానికి అందే పోషకాల గురించి అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కలోంజి గింజలల్లో విటిమిన్ ఎ, బి, బి12, సి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.
కలోంజి గింజలను తీసుకోవడం వల్ల మనం అందమైన, ఆరోగ్యమైన జుట్టును, చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఆందోళన, ఉద్రిక్తత వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే కాలోంజి గింజలను తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఇక శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా కలోంజి విత్తనాలు మనకు సహాయపడతాయి. కాలోంజి గింజలను తీసుకోవడం వల్ల అలెర్జీ, చికాకు, బ్రోంకోడైలేటర్ వంటి శ్వాస సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో కలోంజి గింజలు మనకు తోడ్పడతాయి. అంతేకాకుండా ఇన్ ప్లామేషన్, ఆటో ఇమ్యూనో వ్యాధులు, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి వ్యాధులతో బాధపడే వారికి కూడా కలోంజి విత్తనాలు చక్కటి ఉపశమనాన్ని అందిస్తాయి. శరీరంలో రోగనిరోశధక శక్తిని పెంచి అంటువ్యాధులు రాకుండా చేయడంలో వివిధ అనారోగ్య సమస్యల నుండి త్వరగా కోలుకునేలా చేయడంలో కలోంజి విత్తనాలు మనకు సహాయపడతాయి. అలాగే జీర్ణ సమస్యలను తగ్గించి జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఈ గింజలు దోహదపడతాయి.
ఇక కలోంజి విత్తనాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి షుగర్ ను అదుపులో ఉంచడంలో ఈ గింజలు మనకు సహాయపడతాయి. అలాగే కలోంజి విత్తనాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఈ విధంగా కలోంజి గింజలు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయని అనేక అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడతాయని కనుక వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.