Curry Leaves Karam Podi : క‌రివేపాకు కారం పొడిని ఇలా చేయండి.. అన్నంలో క‌లిపి తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Curry Leaves Karam Podi : క‌రివేపాకును వంట‌ల్లో వాడ‌డంతో పాటు దీనితో కారం పొడి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. క‌రివేపాకు కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, దోశ‌, ఇడ్లీ వంటి అల్పాహారాల‌తో తీసుకోవ‌డానికి ఈ కారం పొడి చ‌క్క‌గా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ కారం పొడిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. మొద‌టిసారి చేసేవారు కూడా చాలా సుల‌భంగా ఈ కారం పొడిని త‌యారు చేసుకోవ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ క‌రివేపాకు కారం పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌రివేపాకు కారం పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, శ‌న‌గ‌ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, మిన‌ప‌ప్పు – 3 టేబుల్ స్పూన్స్, ధ‌నియాలు – 3 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 20, ముదురు క‌రివేపాకు – 50 గ్రా, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

Curry Leaves Karam Podi recipe make in this way
Curry Leaves Karam Podi

క‌రివేపాకు కారం పొడి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత ధ‌నియాలు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి వేగిన త‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి. క‌రివేపాకును క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత జీల‌కర్ర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవ‌న్నీ చ‌ల్లారిన త‌రువాత జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, చింత‌పండు, ప‌సుపు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఈ కారం పొడి చ‌ల్లారిన త‌రువాత గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌రివేపాకు కారం పొడి త‌యారవుతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts