Karra Pendulum : కర్ర పెండలం.. దీనిని టపియోకా, కసావా అని కూడా అంటారు. దీనిని మనలో చాలా మంది చూసే ఉంటారు. కర్ర పెండలాన్ని చాలా మంది ఆహారంగా తీసుకుంటారు. ఇది మనకు ఎక్కువగా అడవుల్లో లభిస్తుంది. ఈ దుంపను సేకరించడానికి భూమిలో చాలా లోతుగా తవ్వాల్సి ఉంటుంది. ఇది ఎక్కువగా సెప్టెంబర్, అక్టోబర్ మసాలల్లో లభిస్తుంది. ఇది మనకు మార్కెట్ లో కూడా లభిస్తుంది. కిలో 100 నుండి 150 రూపాయల వరకు ఉంటుంది. కర్ర పెండలాన్ని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో ఔషధాల తయారీలో కూడా దీనిని విరివిరిగా ఉపయోగిస్తారు.
దీనిలో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, జింక్, విటమిన్ బి, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది ఒక బలవర్దకమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు. ఈ కర్ర పెండలాన్ని ఉడికించి తీసుకోవచ్చు. అలాగే మంటపై కాల్చి తీసుకోవచ్చు. కర్ర పెండలాన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గుండె బలంగా తయారవుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్జీమర్స్ సమస్య రాకుండా ఉంటుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె సమస్యలతో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని మోతాదుకు మించి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
కర్రపెండలాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో కఫం ఎక్కువగా తయారవుతుంది. అలాగే కడుపు నొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం, వాంతులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు, అలర్జీలతో బాధపడే వారు, లోబీపీతో బాధపడే వారు దీనిని తీసుకోకపోవడమే మంచిది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా దీనిని తీసుకోకూడదు. అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడే వారు కూడా ఈ కర్రపెండలాన్ని తీసుకోకపోవడమే మంచిది. ఈ విధంగా దుష్ప్రభావాలు ఉన్నప్పటికి కర్ర పెండలాన్ని తగిన మెతాదులో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.