Lemon Seeds : ఈ ప్ర‌యోజ‌నాలు తెలిస్తే ఇక‌పై నిమ్మ‌కాయ‌ల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌రు..!

Lemon Seeds : మ‌న‌కు సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా దాదాపు అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉండే వాటిల్లో నిమ్మ‌కాయ‌లు కూడా ఒక‌టి. నిమ్మ‌కాయ‌లు మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. నిమ్మ‌ర‌సం మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుతుంది. క‌నుక‌నే వేస‌విలో చాలా మంది నిమ్మ‌ర‌సాన్ని తాగుతుంటారు. నిమ్మ‌ర‌సాన్ని తాగడం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే కేవ‌లం నిమ్మ‌కాయ‌లే కాదు.. మ‌న‌కు నిమ్మ విత్త‌నాలు కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. క‌నుక ఇక‌పై వీటిని ప‌డేయ‌కండి. వీటిని కూడా తీసుకోవ‌చ్చు. వీటి వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మ‌కాయ‌ల్లాగే నిమ్మ విత్త‌నాలు కూడా డిటాక్సిఫ‌యింగ్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అంటే.. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయ‌న్న‌మాట‌. వీటిని నీళ్ల‌లో వేసి మ‌రిగించి తాగితే శ‌రీరంలోని వ్య‌ర్థాలు అన్నీ బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. దీంతో శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. లివ‌ర్, కిడ్నీలు శుభ్ర‌మ‌వుతాయి. అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఇక ఈ విత్త‌నాల‌ను పెనంపై కాస్త వేయించి తీసుకుంటే నొప్పులు త‌గ్గుతాయి. వాపుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది.

Lemon Seeds benefits in telugu very useful in these health conditions
Lemon Seeds

నిమ్మ విత్త‌నాల‌ను తీసుకుంటే జీర్ణ వ్య‌వ‌స్థ మొత్తం శుభ్ర‌మ‌వుతుంది. పేగుల్లో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. అలాగే పురుగులు కూడా న‌శిస్తాయి. నిమ్మ విత్త‌నాల‌ను పేస్ట్ చేసి ముఖానికి రాసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోతాయి. నిమ్మ విత్త‌నాల‌ను నీళ్ల‌లో వేసి మ‌రిగించి తాగ‌డం వ‌ల్ల మూత్రాశ‌య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ముఖ్యంగా మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. నిమ్మ విత్త‌నాల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. క‌నుక వీటిని తీసుకుంటే జ్వ‌రాలు రాకుండా చూసుకోవ‌చ్చు.

నిమ్మ విత్త‌నాల్లో యాంటీ ఫంగ‌స్ గుణాలు కూడా ఉంటాయి. వీటిని పేస్ట్‌లా చేసి తొడ‌లు, గ‌జ్జ‌ల్లో రాయాలి. దీంతో చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే ఈ పేస్ట్‌ను గోళ్ల‌కు కూడా రాయ‌వ‌చ్చు. దీని వ‌ల్ల గోరు చుట్టు, గోరు ఫంగ‌స్ వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అయితే గ్యాస్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు మాత్రం నిమ్మ‌కాయ విత్త‌నాల‌ను జాగ్ర‌త్త‌గా వాడుకోవాలి. లేదంటే అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం ఇబ్బందుల‌కు గురి చేస్తాయి. ఇలా నిమ్మ విత్త‌నాల‌తో మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Editor

Recent Posts