హెల్త్ టిప్స్

ఈ సారి టీ చేసేట‌ప్పుడు ….ఇలా చేయండి, ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ చెప్పండి.!

ఉదయం లేవగానే టీ తాగడం అందరికీ అలవాటు…కొంతమందికి టీ తాగకపోతే ఆరోజంతా ఏదో కోల్పొయినవాళ్లలా ఫీలవుతారు… ఆరోగ్యం పై శ్రద్ద పెరిగి టీలో కూడా చాలా రకాలు వచ్చాయి.. లెమన్ టీ,పుదీనా టీ,అల్లం టీ ఇలా…. ఈసారి డిఫరెంట్ గా లవంగాల టీ ట్రై చేసి చూడండి…రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.. లవంగాల తో చేసిన టీ తాగినట్టయితే జీర్ణక్రియను పెంపొందిస్తుంది. భోజనానికి ముందు ఒక కప్పు లవంగాల‌ టీ తాగటం వలన అజీర్ణం, పొట్టలో కలిగే అసౌకర్యాలు, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.కార్మినేటివ్ గుణాలను కలిగి ఉండే లవంగా టీ అపానవాయువు (గ్యాస్) వంటి సమస్యల నుండి, ఉదర భాగంలో కలిగే నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

కీళ్ళనొప్పులు,కండరాల నొప్పి లేదా చీలమండల కండరాలు దెబ్బ తినటం వలన కలిగే నొప్పి నుండి ఉపశమనం పొందుటకు లవంగాల తో చేసిన టీ బాగ పనిచేస్తుంది. లవంగాల టీ తయారు చేసి, శుభ్రమైన బట్టను టీలో ముంచి నాన్చండి.ఈ నానిన గుడ్డను ప్రభావిత ప్రాంతాలలో 20 నిమిషాల పాటూ ఉంచండి.ఇలా రోజు రెండు నుండి 3 సార్లు చేయటం వలన మంచి ఫలితం మీరే గమనిస్తారు.. లవంగంతో చేసిన టీకి కొద్దిగా నాన్- క్లోరిన్ నీటిని కలపండి. ఈ రకం గాడత తక్కువగా గల టీని యాంటీ ఫంగల్ డౌచ్ (శరీర అవయవాలను శుభ్రం చేసుకోటానికి ఉపయోగించే ద్రవం), గా యోని ప్రాంతంలో కలిగే ఈస్ట్ ఇన్ఫెక్షన్ లను తగ్గించే ద్రవంగా వాడవచ్చు.

make cloves tea and drink it for many health benefits

నలుపు ,ఎరుపు వెంట్రుకలు కలిగి ఉండి జుట్టు అందవిహీనంగా ఉంటే లవంగాల తో చేసిన టీ జుట్టుకు అప్లై చేయండి .దాని వలన ఎరుపు జుట్టును మరింత ప్రకాశవంతగా మర్చి, హైలైట్ అయ్యేలా చేస్తుంది. తలస్నానం చేసాక చివరలో లవంగా టీ తో కడిగి, శుభ్రమైన నీటితొ మళ్ళి కడగండి. మార్పు గమనించండి… పిక్నిక్ లేదా ట్రిప్ లలో ఒక బాటిల్ లో లవంగాల తో చేసిన టీ మీతో తీసుకెళ్ళండి. మంచి హ్యాండ్ వాష్ గా పని చేస్తుంది.కొద్దిగా ఈ టీని తీసుకొని చేతులకు రాసుకోండి. ఇలా రోజు భోజనానికి ముందు మరియు తరువాత టీని చేయికి పూసుకోవటం ఒక అలవాటుగా చేసుకోండి. యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉండే ఈ టీ చేతులను శుభ్రం చేస్తుంది. కావున ఎల్లపుడు మీతో ఉంచుకోవటం చాలా మంచిది.

Admin

Recent Posts