తాజాగా చేసిన ఒక అధ్యయనం మేరకు ప్రతిరోజూ కొద్దిపాటి విటమిన్ బి తీసుకుంటే వృధ్ధాప్యంలో వచ్చే మతిమరుపు ఉండదట. అంతేకాదుఆ వయసులో వచ్చే అల్జీమర్స్ వ్యాధి సైతం రాదంటున్నారు. రెండు సంవత్సరాలపాటు ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ రీసెర్చర్లు సుమారు 250 కి పైగా వ్యక్తులను 70 సంవత్సరాల వయసు లేదా అంతకంటే అధిక వయసు వున్న వారిని పరిశీలించారు.
వారికి ప్రతి దినం విటమిన్ బి అధికంగాను, సహజంగాను వుండే బీన్స్, మాంసం, పప్పులు, అరటిపండ్లు వంటి ఆహారాలను ఇచ్చారు. ఈ ఆహారం తీసుకున్న వారిలోని బ్రెయిన్ చర్యలు అంటే ప్రణాళికలు, నిర్వహణ, సమాచారాన్ని తిరిగి గుర్తు చేసుకోవడం వంటివి ఏ మాత్రం తగ్గలేదని ఆ వయసులో కూడా వారు ఎంతో సమర్ధతగా పనులు నిర్వహించారని తెలిపారు.
అయితే, సహజ ఆహారాలకు బదులు విటమిన్ బి ని టాబ్ లెట్ రూపంలో తీసుకున్నవారిలో మాత్రం ఇంత స్ధాయిలో జ్ఞాపక శక్తి ఇంత స్ధాయిలో లేదట. జ్ఞాపక శక్తికొరకు మందులు వాడేకంటే సహజ ఆహారాలు తీసుకోవటం మంచిదని రీసెర్చి చెపుతోంది. పరిశోధనా వివరాలను హెల్త్ సప్లిమెంట్స్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లోని అధ్యయనకారుడు కేరీ రుక్స్టన్ తెలిపినట్లు డైలీ మెయిల్ వార్తా పత్రిక ప్రచురించింది.