Rice : అన్నాన్ని ఇలా వండుకుని తింటే షుగ‌ర్ రాద‌ట‌..!

Rice : శారీర‌క శ్ర‌మ చేసేవారు ఎంత తిన్నా కూడా వారి ఆరోగ్యానికి ఏమీ కాదు. ఇక స‌మ‌స్యంతా కూర్చుని ప‌ని చేసే వారికే. కూర్చుని ప‌ని చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో క్యాల‌రీలు పేరుకుపోతాయి. దీని వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డం, బీపీ అలాగే షుగ‌ర్ వంటి రోగాలు రావ‌డం జ‌రుగుతుంది. ఈ రోజుల్లో అంద‌రూ తెల్ల‌గా మ‌ల్లెపువ్వులా ఉన్న అన్నాన్ని తిన‌డానికే ఇష్ట‌ప‌డుతున్నారు. పోష‌కాలు, ఫైబ‌ర్ ఏ మాత్రం లేని ఈ అన్నంతో మ‌న‌కు ఎన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో మాట‌ల్లో చెప్ప‌లేం. కానీ ఈ స‌మ‌స్య‌లన్నింటికీ ఒక ప‌రిష్కార మార్గం దొరికింద‌ని నిపుణులు చెబుతున్నారు. అన్నాన్ని క‌నుక కింద చెప్పిన ప‌ద్ద‌తిలో వండుకుని తింటే షుగ‌ర్, బీపీ వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ని వారు చెబుతున్నారు.

ఆరోగ్యానికి హాని క‌ల‌గ‌కుండా ఉండాలంటే అన్నాన్ని ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బియ్యాన్ని మంచి నీటితో క‌డ‌గాలి. త‌రువాత వంట‌ల్లో వాడే కొబ్బ‌రి నూనెను మూడు శాతం వేయాలి. అన‌గా ఒక‌కిలో బియ్యానికి 30 గ్రామ‌ల కొబ్బ‌రి నూనెను వేసి అన్నాన్ని య‌థావిధిగా వండాలి. వండిన అన్నాన్ని ప‌ది గంట‌ల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. త‌రువాత దాన్ని బ‌య‌ట‌కు తీసి వెంట‌నే తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల లాభాలు అనేకం ఉన్నాయి. కొబ్బ‌రి నూనెను క‌లిపి అన్నం వండ‌డం వ‌ల్ల రెసిస్టెంట్ స్టాక్స్ పిండి ప‌దార్థంగా మార‌తాయి. ఇలా పిండి ప‌దార్థంగా మారిన అన్నం తింటే స‌గం క్యాల‌రీలు త‌గ్గి వ‌స్తాయి. కొవ్వు ఉండ‌దు.

make rice in this way to control blood sugar levels
Rice

క్యాల‌రీలు ర‌క్త‌నాళాల్లో కొద్ది కొద్దిగా క‌లుస్తాయి. దీని వ‌ల్ల ఎప్ప‌టి శ‌క్తి అప్పుడే ఖ‌ర్చై పోతుంది. ఈ అన్నం సాధార‌ణ అన్నంలా కాకుండా చాలా ఆల‌స్యంగా జీర్ణ‌మ‌వుతుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. ఇలా కొబ్బ‌రి నూనె వేసి వండ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో కొత్త‌గా కొవ్వు ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. షుగ‌ర్ వ్యాధి ఉన్న వారికి ఈ అన్నం ఎంతో మేలు చేస్తుంది. ఇలా అన్నాన్ని వండుకుని తిన‌డం వల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. షుగ‌ర్ కూడా అదుపులో ఉంటుంది. మాములు అన్నాన్ని వండుకుని తిన‌డం కంటే ఇలా అన్నంలో కొబ్బ‌రి నూనె వేసి తిన‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌ట్ట‌డ‌మే కాకుండా భ‌విష్య‌త్తులో కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts