Malabar Tamarind : చింతపండును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చని మీకు తెలుసా.. చింతపండును తీసుకోవడం వల్ల బరువు తగ్గడం ఏంటి అని మనలో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు. చూడడానికి నల్లగా పుల్లటి రుచిని కలిగి ఉండే మలబార్ చింతపండును తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం వంటల్లో వాడే చింతపండుకు ప్రత్యామ్నాయంగా ఈ మలబార్ చింతపండును ఉపయోగించవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు దీనిని తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చని వారు చెబుతున్నారు. ఈ మలబార్ చింతపండు ఆకలిని నియంత్రించే లిప్టిన్ హార్మోన్ చురుకుగా పని చేసేలా, ఎక్కువగా విడుదల అయ్యేలా చేయడంలో సహాయపడుతుంది.
దీనిని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గి మనం తక్కువ ఆహారాన్ని తీసుకోగలుగుతాము. అలాగే దీనిని ఉపయోగించడం వల్ల కాలేయ కణాల్లో, కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు తొలగిపోతుంది. కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు త్వరగా కరిగిపోయ్యేలా చేయడంలో ఈ మలబార్ చింతపండు మనకు ఉపయోగపడుతుంది. అదే విధంగా మనం తీసుకున్న ఆహారాలన్నీ చక్కెరలుగా మారతాయి. శరీరం తనకు కావల్సిన చక్కెరలను వాడుకోగా మిగిలిన చక్కెరలు కొవ్వుగా మారి కొవ్వు కణాల్లో పేరుకుపోతాయి. ఇలా కొవ్వు కొవ్వు కణాల్లో పేరుకుపోకుండా చేసే గుణం కూడా ఈ మలబార్ చింతపండుకు ఉంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోకుండా చేయడంలో ఈ మలబార్ చింతపండు మనకు సహాయపడుతుంది.
అదేవిధంగా కాలేయంలో జరిగే కొలెస్ట్రాల్ సింథసిస్ ను నియత్రించే గుణం కూడా ఈ మలబార్ చింతపండుకు ఉంది. కొలెస్ట్రాల్ సింథసిస్ నియంత్రణలో ఉండడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోకుండా ఉంటుంది. తద్వారా మనం బరువు పెరగకుండా ఉండవచ్చు. బరువు తగ్గడంతో పాటు దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, జీర్ణ వ్యవస్థ చురుకుగా పని చేసేలా చేయడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ మలబార్ చింతపండు ఎంతో సహాయపడుతుంది. అలాగే దీనిలో యాంటీ ఇన్ ప్లామేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా అధికంగా ఉన్నాయి. మలబార్ చింతపండును తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
దీనిని పప్పుల్లో, పచ్చళ్లల్లో, సాంబార్, రసం వంటి వాటిల్లో చింతపండుకు బదులుగా ఈ మలబార్ చింతపండును అధిక బరువు సమస్యతో బాధపడే వారు వాడుకోవడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ చింతపండును వాడడం వల్ల పొట్టలో గ్యాస్ కూడా తలెత్తకుండా ఉంటుంది. వంటల్లో ఈ మలబార్ చింతపండును వాడడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.