Mango Flower : ఇది అంద‌రికీ తెలిసిందే.. దీన్ని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Mango Flower : మామిడి పండ్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడి పండ్ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మామిడి పండ్లు రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. వీటిలో అనేక ర‌కాల పోష‌కాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. మామిడి పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే మామిడి పండ్ల‌తో పాటు మామిడి పూత కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మామిడి పూత మ‌నంద‌రికి తెలిసిందే. కానీ మామిడి పూత మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. మామిడిపూత‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

మామిడి పూత వ‌ల్ల మన ఆరోగ్యానికి క‌లిగే మేలు ఏమిటి.. అలాగే దీనిని ఎలా ఉప‌యోగించాలి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో మామిడిపూత మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంది. ఒక గ్లాస్ నీటిలో మామిడి పూత‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఈ నీటిని వ‌డ‌క‌ట్టి తాగాలి. ఇలా మామిడి పూత నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరం డీహైడ్రేష‌న్ కు గురి కాకుండా ఉంటుంది. జీర్ణ‌క్రియ సాఫీగా సాగుతుంది. డ‌యేరియా వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి. అలాగే ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. నేటి త‌రుణంలో చాలా మంది కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి ఉంటుంది.

Mango Flower health benefits in telugu
Mango Flower

క‌నుక శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్న‌వారు రోజూ ఒక గ్లాస్ మామిడి పూత నీటిని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ మామిడి పూత నీటిని తాగ‌డం వ‌ల్ల ఎసిడిటీ స‌మ‌స్య త‌గ్గుతుంది. ముక్కు నుండి ర‌క్తం కారడం కూడా త‌గ్గుతుంది. మామిడి పూత నీటిని తాగ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గుతుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య దూర‌మ‌వుతుంది. శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. మామిడి పూతను నీటిలో వేసి రాత్రంతా ఉంచి ఉద‌యాన్నే తీసుకోవ‌చ్చు లేదా నీటిలో మామిడి పూత వేసి మ‌రిగించి డికాష‌న్ లా చేసుకుని కూడా తీసుకోవ‌చ్చు. ఈ విధంగా మామిడిపూత‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts