కొన్ని కూరగాయలు, పండ్లలో తొక్కలో ఉండే ఫైబర్ ఆరోగ్యం అని తెలిసినా తొక్క పారేస్తాం…అన్నం వండేప్పుడు గంజి ఆరోగ్యం అని తెలిసినా పారబోస్తాం…అలాగే మామిడి కాయ, పండు తింటాం టెంక పారేస్తాం. కానీ టెంకలోని జీడివల్ల కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి… ఫలరాజంగా పిలిచే మామిడిలో పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. పండుతో పాటే మామిడి జీడిలో కూడా ఎన్నోరకాల ఔషధ గుణాలున్నాయి.
మామిడి పండు, కాయ తిని టెంకను పారేస్తాం. కానీ టెంకలో ఉండే మామిడి జీడిని ఎండబెట్టుకుని తింటే మంచి ఫలితాలుంటాయి. మామిడిచెక్కకు కడుపులోని నులిపురుగుల్ని చంపే శక్తి ఉంది.. మామిడి టెంకలోని జీడిని ఎక్కువ తీసుకుని ఒకేసారి నోట్లో వేసుకుంటే నోట్లో పొక్కులు వస్తాయి. అతి తక్కువ మోతాదులో పంచదార కలిపి తీసుకోవాలి. పిల్లలు వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటే మామిడి జీడిని కొద్ది మోతాదులో పంచదార కలిపి పెడితే మార్పు కనిపిస్తుంది.
మామిడి జీడి, కరక్కాయతో కలిపి మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఈ పొడి ఉదయం సాయంత్రం రోజూ రెండుపూటలా తీసుకుంటే షుగర్ అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ వలన ముందుగా చెడిపోయేది జీర్ణాశయమే. అందుకే జీర్ణాశయాన్ని కాపాడుకోవాలంటే మామిడి జీడి కరక్కాయ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా తీసుకోవాలి. మామిడిజీడి, కరక్కాయ మిశ్రమం రుతుక్రమ సమస్యలను కూడా తగ్గించి, గర్భాశయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.