Mango Leaves Water : మారుతున్న జీవన విధానం కారణంగా మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. పెద్ద వారే కాకుండా యుక్త వయసులో ఉన్న వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, ఊబకాయం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వంటి వాటిని షుగర్ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. షుగర్ వ్యాధి బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి నెలకొంది.
కేవలం మందుల ద్వారానే కాకుండా సహజసిద్ద పద్దతిలో కూడా మనం షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో మామిడి ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకులు షుగర్ వ్యాధిని నియంత్రించడమేంటి అని మనలో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. కానీ ఇది నిజం. మామిడి ఆకుల్లో షుగర్ వ్యాధిని నియంత్రించే గుణాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. షుగర్ వ్యాధి గ్రస్తులు మామిడి ఆకులను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కొన్ని మామిడి ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక మామిడి ఆకులను వేసి మరో 10 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని పరగడుపున తాగాలి. మామిడి ఆకుల కషాయాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. తద్వారా షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఈ మామిడి ఆకుల కషాయాన్ని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు తొలగిపోతాయి.
ఈ కషాయాన్ని ప్రతిరోజూ తాగడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించడంతోపాటు బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. ఆస్తమా వ్యాధి గ్రస్తులకు కూడా మామిడి ఆకుల కషాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆస్తమా వ్యాధి గ్రస్తులు ఈ కషాయాన్ని తాగడం వల్ల ఆస్తమా తగ్గి శ్వాసను చక్కగా తీసుకోగలుగుతారు. మామిడి ఆకుల కషాయం శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది. మామిడి ఆకుల కషాయాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చాలా త్వరగా షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.