హెల్త్ టిప్స్

Boda Kakarakaya : బోడ కాకరతో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు మిస్ అవ్వకుండా తినండి..

Boda Kakarakaya : కూరగాయల‌ల్లో విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర. ఒకప్పుడు అడవులు, తుప్పల్లో సహజసిద్ధంగా పెరిగిన బోడకాకర లేదా ఆగాకరకాయ పోషకాల గని అని చెప్పవచ్చు. కాకర జాతికి చెందినవే ఆకాకరకాయలు. వర్షాకాలంలో ఇవి విరివిగా దొరుకుతాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో ఉన్నాయి. బోడ కాకరకాయలు తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అని డాక్టర్లు చెప్తున్నారు. ఇవి శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి.

బోడ కాకరను సాధారణ కూరగాయగానే కాకుండా దీని వేర్లు, పువ్వులు, రసం, ఆకులను కూడా అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. ఆగాకరకాయల‌లో కేలరీలు తక్కువగా ఉండుట వలన అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. బోడ కాకరకాయలను తినడం వలన గ్యాస్ట్రిక్ అల్సర్, పైల్స్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు (బీపీ) నియంత్రణలో ఉండేలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఆగాకరకాయల‌లోని కెరోటినాయిడ్లు కంటికి సంబంధించిన సమస్యల‌ను రాకుండా చేస్తాయి.

many wonderful health benefits of boda kakara

గర్భిణీలు వీటిని కూరగా చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే బోడ కాకర కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెడుతుంది. అధిక చెమటను తగ్గిస్తుంది. బోడకాకర దగ్గుకు మంచి మెడిసిన్. బోడ కాకరలో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు, గ్లైకోసైడ్లు, అమైనో ఆమ్లాలు, జింక్, పొటాషియం, భాస్వరం మరియు సోడియం పుష్కలంగా ఉన్నాయి. వీటిలో సమృద్ధిగా లభించే ఫ్లేవనాయిడ్లు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి. కాబట్టి ఈ ఆగాకరకాయలను దొరికినప్పుడే మిస్ కాకుండా తినండి.

Share
Admin

Recent Posts