హెల్త్ టిప్స్

ఆవు పాల‌ను రోజూ తాగితే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

ఆవు పాలు పలుచ‌గా ఉంటాయి. త్వ‌ర‌గా జీర్ణం అవుతాయి. చిన్నపిల్లలకు తల్లిపాలతో సమానం. మనిషికి చలాకీని పెంచుతాయి. ఉదర సంబంధమైన జబ్బుల‌ను త‌గ్గిస్తాయి. ప్రేగులలోని క్రిములు నశిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. చదువుకునే పిల్లలకు, మనస్సుతో పనిచేసే వ్యక్తులకు తెలివిని పెంచి వారిని నిష్ణాతులను చేస్తాయి. మనస్సును, బుద్ధిని చైత న్యవంతం చేస్తాయి. సాత్విక గుణమును పెంచుతాయి. ఆవుపాలలో మనకు మిక్కిలి మేలుచేసే బంగారు తత్వముతో కూడిన విట మిను ఎ అధికంగా కలిగిన కెసీన్‌ అనే ఎంజైమ్ ఉంటాయి.

వీటి వలన ఈ పాలు పసుపు పచ్చగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. తెల్ల ఆవుపాలు వాతాన్ని, నల్ల (కపిల) ఆవు పాలు పిత్తాన్ని, ఎరుపురంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి. ఆవుపాలు సర్వరోగ నివారిణిగా ప‌నిచేస్తాయి. ఆవుపాలు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. ఘృతేన వర్ధతే బుద్దిః క్షీరేణాయుష్య వర్ధనం. అంటే.. ఆవునెయ్యి బుద్ధిబలాన్ని ఆయుష్షును పెంచుతుంది.

many wonderful health benefits of drinking cow milk daily

ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉంది. మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న, వగైరా లలోని స్థూల భాగం మజ్జ (మూలుగ) గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవు తుంది. ఆరోగ్యమైన ఎముకలు, మజ్జ (మూలుగ), మంచి సాత్వికం, శ్రావ్యం అయిన వాక్కు వీటి కోసం ఆవు నెయ్యి, వెన్న తప్పక తినాలి. ఆవునెయ్యి రక్తంలో మంచిదైన హెచ్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ను పెంచి చెడుదైన ఎల్‌డిఎల్‌ కొలెస్ట‌రాల్‌ను త‌గ్గిస్తాయి. హెచ్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ గుండె జబ్బులు, అధిక రక్తపోటు రాకుండా కాపాడుతుంది.

Admin

Recent Posts