హెల్త్ టిప్స్

మ‌న శ‌రీరానికి వెన్న ఎంత ఆరోగ్య‌క‌ర‌మో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ప్రతి ఇంట్లోనూ వెన్న&comma; నెయ్యి తరచూ వాడుతుంటారు&period; మేధాశక్తిని&comma; చురుకుదనాన్ని పెంచే శక్తిగల వెన్న వలన అనేక ప్రయోజనాలు&comma; మరెన్నో సద్గుణాలు ఉన్నాయి&period; మజ్జిగను చిలికి తీసిన వెన్న మధురంగా ఉండటమేగాక శరీరంలో ధాతువులను సమస్థితికి తీసుకువచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతుంది&period; అంటే మెటబాలిజం అనే జీవన ప్రక్రియను శరీరం సక్రమంగా నిర్వర్తించుకునేలా చేస్తుంది&period; సులభంగా జీర్ణమవుతుంది&period; జఠర రసాన్ని పెంచి&comma; జీర్ణకోశాన్ని క్రమబద్ధీకరిస్తుంది&period; పొడి దగ్గును అరికడుతుంది&period; వెన్న కొంచెం ఆలస్యంగా అరుగుతుంది&period; కానీ&comma; బలవర్థకమయినది&period; కాలేయాన్ని బలంగా ఉంచుతుంది&period; చర్మరోగాలను దరిచేరనీయదు&period; పిల్లల చేత వెన్న తినిపిస్తే మేధాశక్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజా వెన్నలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి&period; ఎ&comma; బి&comma; సి&comma; డి విటమిన్లు ఉన్నందున ఎదిగే పిల్లలకు వెన్న చక్కని పౌష్టికాహారం&period; వెన్నలో లభించే కొవ్వు పదార్థం సులభంగా జీర్ణమై&comma; బలాన్ని వృద్ధిపరుస్తుంది&period; ప్రతిరోజూ పెరుగును చిలికి వెన్న తీసి పిల్లలకు పెడితే మేధావంతులుగా&comma; ఆరోగ్యంగా పెరుగుతారు&period; వెన్నను శరీరానికి మర్దనా చేసినట్లయితే చర్మానికి వర్ఛస్సును&comma; మృదుత్వాన్ని ప్రసాదిస్తుంది&period; నీరసించే పిల్లలకు&comma; బలహీనులకు&comma; గుండె బలం తక్కువగా ఉన్నవారికి వెన్న అత్యుత్తమమయినది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73391 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;venna&period;jpg" alt&equals;"do you know how healthy venna for our body is " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవు వెన్నకు&comma; గేదె వెన్నకు చాలా తేడా ఉంటుంది&period; శరీరానికి అవసరమైన చమురు గుణాన్ని కలుగజేసి&comma; చలువను&comma; దృఢత్వాన్ని కలిగించడంలో ఆవు వెన్న అత్యుత్తమమయినది&period; గేదెవెన్న కంటే ఆవు వెన్న సులభంగా జీర్ణమవుతుంది&period; వాతము&comma; పిత్తమును క్రమబద్ధీకరించి&comma; రక్తదోషము&comma; క్షయ&comma; మూలవ్యాధులను నివారించడంలో ఆవు నెయ్యి విశిష్టమైనది&period; అంతేగాక&comma; ఈ రెండు రకాల వెన్న బలాన్ని&comma; వీర్యవృద్ధిని&comma; వర్ఛస్సును కలుగజేస్తుంది&period; వెన్నలో పంచదార కలిపి తీసుకుంటే కడుపులో మంట&comma; పోట్లు సమసిపోతాయి&period; తేనె&comma; చెరకురసం&comma; ఉప్పు వెన్నకు విరుగుడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts