నారింజ పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండ్లలో ఉండే ఫైబర్ మనకు ఎదురయ్యే జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. అలాగే అనేక ఇతర ప్రయోజనాలు కూడా మనకు నారింజ పండ్లను తినడం వల్ల కలుగుతాయి. అయితే కేవలం నారింజ పండ్లే కాదు, వాటి తొక్కలతోనూ మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటంటే…
1. నారింజ పండు తొక్కలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల నొప్పులు, గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. వాటిపై నారింజ పండు తొక్కను రుద్దుతూ ఉంటే చాలు.. ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
2. నారింజ పండ్ల తొక్కలను ఎండబెట్టి పొడి చేసి నిత్యం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.
3. నారింజ పండ్ల తొక్కలను ఎండబెట్టి పొడి చేసి రోజూ తింటే మన శరీరానికి కావల్సిన ఫైబర్ అందుతుంది. దీంతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక బరువు తగ్గుతారు.
4. మొటిమలతో బాధపడుతున్నవారు నారింజ పండు తొక్కను రోజూ మొటిమలపై రాస్తూ ఉంటే త్వరలోనే మొటిమలు తగ్గుతాయి.
5. చర్మానికి కాంతిని అందివ్వడంలో, చర్మాన్ని మృదువుగా మార్చడంలో నారింజ పండు తొక్క అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం నారింజ పండు తొక్కలను చర్మానికి రుద్దుతూ ఉంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.