ఆరోగ్యం

వారానికి ఒక‌సారి నువ్వుల నూనెతో శ‌రీరాన్ని మసాజ్ చేసుకోవాలి.. ఎందుకో తెలుసా ?

నువ్వుల నూనె మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ఈ నూనెతో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. దీంతో మ‌న పెద్ద‌లు వారం వారం శ‌రీరాన్ని మ‌ర్ద‌నా చేసుకుని స్నానం చేసేవారు. అయితే ఈ ప‌ద్ధ‌తిని ఇప్పుడు పాటించ‌డం లేదు. కానీ నువ్వుల నూనెతో వారానికి ఒక‌సారి అయినా స‌రే శ‌రీరాన్ని బాగా మ‌ర్ద‌నా చేసుకుని స్నానం చేయాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

massage you body with sesame oil weekly once know the reason

1. నువ్వుల నూనెతో మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల కండ‌రాలు రిలాక్స్ అవుతాయి. కండ‌రాల నొప్పులు త‌గ్గుతాయి. కండ‌రాలు మ‌ర‌మ్మ‌త్తుల‌కు గుర‌వుతాయి. దీంతో కండ‌రాలు ఆరోగ్యంగా ఉంటాయి. దృఢంగా మారుతాయి. శ‌క్తిని అందిస్తాయి.

2. ప్ర‌స్తుతం నిత్య జీవితంలో చాలా మందిని ఒత్తిడి, ఆందోళ‌న బాధిస్తున్నాయి. క‌నుక అలాంటి వారు వారంలో ఒకసారి నువ్వుల నూనెతో మ‌సాజ్ చేసుకుంటే ఆయా స‌మ‌స్యల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మాన‌సికంగా ఆరోగ్యంగా ఉంటారు.

3. హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు నువ్వుల నూనెతో మ‌ర్ద‌నా చేసుకోవ‌డం ఎంతో మేలు చేస్తుంది. దీంతో బీపీ త‌గ్గుతుంది. ర‌క్త స‌రఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

4. వారానికి ఒక‌సారి మ‌సాజ్ చేసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర ర‌క్త ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలోని భాగాల‌కు ర‌క్తం సుల‌భంగా అందుతుంది. దీంతో ఆ భాగాల‌కు పోష‌కాలు, ఆక్సిజ‌న్ కూడా ల‌భిస్తాయి. దీని వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వచ్చు.

5. నువ్వుల నూనెతో మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా మారుతుంది. జీవ‌క్రియ‌లు మెరుగు ప‌డ‌తాయి.

6. మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు పోతాయి. అన్ని విధ‌లుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Admin

Recent Posts