Cranberries : మనకు అందుబాటులో అనేక రకాల పండ్లు ఉంటాయి. వాటిల్లో క్రాన్ బెర్రీలు కూడా ఒకటి. పండ్ల షాపుల్లో ఇవి ఉంటాయి. కానీ వీటిని చాలా మంది అంతగా పట్టించుకోరు. కానీ వాస్తవానికి ఈ పండ్లు మనకు ఎంతో మేలు చేస్తాయని చెప్పవచ్చు. ఇవి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఎరుపు రంగులో గుండ్రగా ఉంటాయి. రుచి చూస్తే కాస్త పులుపుగా, తియ్యగా ఉంటాయి. అయితే ఈ పండ్లను ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా తెచ్చుకుని తినండి. ఎందుకంటే ఈ పండ్లతో అనేక లాభాలు కలుగుతాయి. ఈ పండ్లు అందించే ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు వీటిని విడిచిపెట్టకుండా తింటారు. ఇక క్రాన్ బెర్రీలతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రాన్ బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీని వల్ల సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. సీజన్లు మారినప్పుడు ఈ పండ్లను తింటే దగ్గు, జలుబు, జ్వరం వంటివి రాకుండా చూసుకోవచ్చు. జ్వరం వచ్చిన వారు క్రాన్ బెర్రీ పండ్లకు చెందిన జ్యూస్‌ను తాగితే త్వరగా కోలుకుంటారు. క్రాన్ బెర్రీలను తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. చర్మాన్ని ఇవి సంరక్షిస్తాయి.
ఈ పండ్లను తింటే దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది. క్రాన్‌బెర్రీలను తినడం వల్ల మూత్రాశయ ఇన్‌ఫెక్షన్‌ల నుంచి బయట పడవచ్చు. దీంతో మూత్రం సాఫీగా జారీ అవుతుంది. ఇక వీటిని తింటే విరేచనాలు తగ్గిపోతాయి. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కనుక క్రాన్ బెర్రీలను ఇకపై మీరు ఎప్పుడైనా బయట మార్కెట్‌లో చూస్తే అసలు విడిచిపెట్టకండి. వీటితో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.