Wood Apple : వెల‌గ‌పండును స్త్రీలు, పురుషులు త‌ప్ప‌క తినాలి.. ఎందుకంటే..?

Wood Apple : వెల‌గ‌పండు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. వినాయ‌క చ‌వితి రోజూ ఈ పండును వినాయ‌కుడికి స‌మ‌ర్పిస్తూ ఉంటారు. వెల‌గ‌పండు ఆధ్యాత్మికంగా చ‌క్క‌టి ప్ర‌ధాన్య‌త‌ను క‌లిగి ఉందని మ‌నంద‌రికి తెలిసిందే. అయితే ఈ వెల‌గపండు ఆధ్యాత్మికంగానే కాదు ఔష‌ధంగా కూడా ఎంతో ప్ర‌ధాన్య‌త‌ను క‌లిగిఉంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయని ఈ పండును తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని ఈ పండును ప్ర‌తి ఒక్క‌రు ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. వెల‌గ‌పండులో ఉండే ఔష‌ధ గుణాల గురించి అలాగే దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల‌గ‌పండును తిన‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, వాంతులు, విరేచ‌నాలు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

వెల‌గ‌పండును తిన‌డం వ‌ల్ల అల్స‌ర్ స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ పండును నేరుగా తిన‌డంతో పాటు దీనితో జ్యూస్ ను కూడా త‌యారు చేసుకుని తాగుతారు. ఈ జ్యూస్ ను 50 మిల్లీ గ్రాముల మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్తం శుద్ది అవుతుంది. అలాగే ఈ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల ఆగ‌కుండా వ‌చ్చే ఎక్కిళ్లు కూడా వెంట‌నే త‌గ్గుతాయి. వెల‌గ‌పండు జ్యూస్ లో బెల్లం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల బ‌ల‌హీన‌త‌, నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఇక మూత్ర‌పిండాల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా వెల‌గ‌పండ్లు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి.

men and women must take Wood Apple know the reasons
Wood Apple

ఈ పండ్ల‌ను తిన్నా లేదా వాటిని జ్యూస్ గా చేసి తీసుకున్నా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. వెల‌గ‌పండును తిన‌డం వ‌ల్ల స్త్రీలల్లో రొమ్ము మ‌రియు గర్భాశ‌య క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. ఈ పండును తిన‌డం వ‌ల్ల పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య మ‌రియు వాటి నాణ్య‌త పెరుగుతుంది. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు వెల‌గ‌పండును తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే ఈ పండును తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క వ‌క్తి పెరుగుతుంది. ఈ పండును తిన‌డం వల్ల 21 ర‌కాల బ్యాక్టీరియాలతో పోరాడే శ‌క్తి మ‌న‌కు ల‌భిస్తుంది. ఈ విధంగా వెల‌గ‌పండు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts