Mozarella Cheese : పాలతో తయారు చేఏ వాటిలో మొజరెల్లా చీజ్ కూడా ఒకటి. చీజ్ లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పవచ్చు. చీజ్ ను అనేక రకాల వంటకాల్లో విరివిగా వాడుతూ ఉంటాము. పిజ్జా, సాండ్విచ్, బర్గర్ వంటి వివిధ రకాల స్నాక్ ఐటమ్స్ లో చీజ్ ను వాడుతూఉంటాము. చీజ్ వేసి చేయడం వల్ల ఈ ఆహార పదార్థాలు మరింత రుచిగా ఉంటాయని చెప్పవచ్చు. సాధారణంగా మార్కెట్ లో చీజ్ మనకు లభిస్తుంది. దీనిని మనం కొనుగోలు చేసి వాడుతూ ఉంటాము. బయట కొనే పని లేకుండా ఈ మొజరెల్లా చీజ్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఇంట్లోనే చాలా సులభంగా పాలతో మొజరెల్లా చీజ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చీజ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – 2 లీటర్స్, వెనిగర్ – అర కప్పు.
చీజ్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పచ్చి పాలను పోసి వేడి చేయాలి. పాలు గోరు వెచ్చగాఅయిన తరువాత ఒక్కో స్పూన్ వెనిగర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా వెనిగర్ అంతా వేసిన 5 నిమిషాల తరువాత పాలు విరిగిపోతాయి. ఇప్పుడు ఈ పాల విరుగుడును జల్లి గంటెలోకి తీసుకుని నీరంతా పోయేలా వత్తుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కడగాలి. తరువాత దీనిని చల్లటి నీటిలో వేసి పూర్తిగా పాలు పోయేలా కడగాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పేపర్ రాప్ లో గట్టిగా చుట్టి మూత ఉండే డబ్బాలో ఉంచి ఫ్రిజ్ లో ఉంచాలి. దీనిని 2 నుండి 3 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచిన తరువాత తురుము కొని లేదా స్లైసెస్ గా కట్ చేసుకుని ఉయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మొజరెల్లా చీజ్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది.