Dates : పురుషులు ఈ స‌మ‌యంలో ఖ‌ర్జూరాల‌ను రోజూ తినండి.. అన్ని స‌మ‌స్య‌లు పోతాయి..!

Dates : ఖ‌ర్జూరాలు మ‌న‌కు సుల‌భంగా ల‌భించే డ్రై ఫ్రూట్స్‌లో ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. ఖ‌ర్జూరాల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని పోష‌కాల‌కు గ‌నిగా చెప్ప‌వచ్చు.వీటిల్లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. క‌నుక ర‌క్త హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే ఫైబ‌ర్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. క‌నుక జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు.

Men should eat Dates in this time to remove their problems
Dates

ఇక ఖ‌ర్జూరాల‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తినాల‌ని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. దీని వ‌ల్ల వాటిల్లో ఉండే పోష‌కాలు అన్నింటినీ శ‌రీరం సుల‌భంగా శోషించుకుంటుంద‌ని చెబుతున్నారు. ఇక ఖ‌ర్జూరాల్లో స‌హ‌జ‌సిద్ధ‌మైన చ‌క్కెర‌లు ఉంటాయి. అవి శ‌రీరానికి హాని చేయ‌వు. క‌నుక వాటిని తిన‌వ‌చ్చు. ఎలాంటి భ‌యం చెందాల్సిన ప‌నిలేదు.

రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 2 ఖ‌ర్జూరాల‌ను తిన్నా చాలు.. ఎన్నో ఉప‌యోగాలు క‌లుగుతాయి. ముఖ్యంగా శ‌క్తి బాగా ల‌భిస్తుంది. ఉద‌యాన్నే మ‌న‌కు శ‌క్తి బాగా అవ‌స‌రం అవుతుంది. క‌నుక ఖ‌ర్జూరాల‌ను తింటే శ‌క్తి ల‌భించి ఉత్సాహంగా మారుతారు. ఎంత ప‌నిచేసినా అల‌సి పోరు. శ‌క్తివంతంగా ఉంటారు.

ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ పెరుగుతాయి. దీంతో రక్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. వీటిల్లో ఉండే ఫైబ‌ర్ మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి బ‌య‌ట ప‌డేస్తుంది. సుఖ విరేచ‌నం అయ్యేలా చేస్తుంది. అజీర్ణ స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుంది. తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేస్తుంది.

ఖ‌ర్జూరాల‌ను మ‌హిళ‌లు కూడా అధికంగానే తిన‌వ‌చ్చు. దీంతో వారిలోనూ ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. నెల నెలా రుతు స‌మ‌యంలో వారి నుంచి అధికంగా ర‌క్తం పోతుంది క‌నుక ఖర్జూరాల‌ను తింటే ర‌క్తం బాగా తయార‌వుతుంది. అలాగే గ‌ర్భిణీల‌కు కూడా ఖ‌ర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి.

ఆయుర్వేద ప్రకారం ఎంతో పురాత‌న కాలం నుంచి పురుషుల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు ఖర్జూరాల‌ను ఉప‌యోగిస్తున్నారు. వీటిని పురుషులు పాల‌తో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల వీర్యం బాగా త‌యార‌వుతుంది. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం రెండు ఖ‌ర్జూరాల‌ను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ను తాగాలి. దీంతో పురుషుల్లో ఉండే స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా వీర్యం ఉత్ప‌త్తి కావ‌డంతోపాటు శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. క‌నుక పురుషులు ఖ‌ర్జూరాల‌ను తింటే మేలు జ‌రుగుతుంది. ఇక డ‌యాబెటిస్ ఉన్న‌వారు మాత్రం వీటిని తీసుకోరాదు.

Admin

Recent Posts