Moustache And Beard : యుక్త వయస్సు వచ్చిన మగవారికి మీసాలు, గడ్డం పెరగాలంటే చిట్కాలు.!

Moustache And Beard : ఒక వయసుకి వచ్చాక అబ్బాయిలలో, అమ్మాయిలలో శరీరంలో మార్పు సహజం. యుక్త వయసుకి వచ్చాక అబ్బాయిలకు వచ్చే మీసాలు, గడ్డాలే మగతనానికి సూచికగా భావిస్తుంటారు. కానీ కొంతమందిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా మీసాలు, గడ్డం రావు. చాలా వరకు షేవ్ చేసుకుంటే వస్తాయనే భ్రమలో ఉంటారు. కానీ అది అపోహ మాత్రమే. అబ్బాయిల్లో మీసాలు, గడ్డం పెరగాలంటే ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే.. వెంట్రుకలు పెరగటానికి ముందుగా షేవ్ చేయండి. స్టీమింగ్ చేసి, పదునుగా ఉండే బ్లేడ్, వేడి నీటి సహాయంతో సరిగా షేవ్ చేయండి. ఎలక్ట్రానిక్ ట్రిమ్మర్ ల‌కు బదులుగా రేజర్ ను వాడడం ఉత్తమం.

వెంట్రుకల పెరుగుదల  కోసం  రోజూ షేవ్ చేయండి అనేది ఒక‌ అపోహ మాత్రమే. రోజూ మీ ముఖ ప్రాంతాన్ని షేవ్ చేయకండి. ఇలా చేయటం వలన అధికంగా ఫాలికిల్ లు ఉద్దీపనలకు గురవటం వలన వెంట్రుకలు మితిమీరిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది. వెంట్రుకలు పెరగడానికి ఏదన్నా క్రీమ్ ని అప్లై చేసేప్పుడు చేతి వేళ్ళతో గడ్డం ప్రాంతపు చర్మాన్ని లాగి,  క్రీము లను రాయండి. ఇలా చేయటం వలన గడ్డం ఉన్న ప్రాంతంలోని అన్ని వెంట్రుకలకు సమపాళ్లల్లో అందుతుంది.

Moustache And Beard follow these tips for their growth
Moustache And Beard

ముఖానికి మర్దనా లేదా మసాజ్ చేయటం ద్వారా ఫాలికిల్ లు ఉద్దీపనలకు గురై ముఖ వెంట్రుకలు పెరుగుతాయి. ఉసిరి లేదా యూకలిఫ్టస్ నూనెతో రోజూ 10 నిమిషాల పాటు మసాజ్ చేయటం వలన ముఖ వెంట్రుక‌లు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ లు అధికంగా గల ఆహార పదార్థాలను తీసుకోవటం వలన ముఖంపై వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి. క్యారెట్, పచ్చని ఆకుకూరలు, చికెన్, మ‌ట‌న్‌, చేపలు, తృణధాన్యాలు, బీన్స్, నట్స్ వంటి వాటిని తీసుకుంటే ముఖంపై వెంట్రుకలు త్వ‌ర‌గా పెరుగుతాయి. దీంతో గ‌డ్డం, మీసాలు బాగా పెరిగి చూసేందుకు చ‌క్క‌గా క‌నిపిస్తాయి. ఇలా ఈ చిట్కాల‌ను పాటిస్తే గడ్డం, మీసాల‌ను బాగా పెంచుకోవ‌చ్చు.

Editor

Recent Posts