Muscle Cramps : కండ‌రాలు ప‌ట్టేస్తున్నాయా.. నిద్ర‌లో పిక్క‌లు ప‌ట్టుకుని ఇబ్బంది ప‌డుతున్నారా.. ఈ చిట్కాలు చాలు..!

Muscle Cramps : మ‌న‌లో చాలా మంది కండ‌రాల తిమ్మిర్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య మ‌న‌ల్ని ఎప్పుడో ఒక‌ప్పుడు ఇబ్బంది పెట్టి తీరుతుంది. కండ‌రాల తిమ్మిర్ల కార‌ణంగా విప‌రీత‌మైన ఇబ్బంది, నొప్పి క‌లుగుతుంది. కండ‌రాల తిమ్మిర్లు రావ‌డానికి ముఖ్యంగా రెండు కార‌ణాలు ఉంటాయి. శ‌రీరంలో ల‌వ‌ణాలు త‌గ్గ‌డం వ‌ల్ల‌, అలాగే వ్యాయామాలు చేయ‌కపోవ‌డం వ‌ల్ల వ‌స్తూ ఉంటాయి. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి మందుల‌ను వాడుతూ ఉంటారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో మందులు వాడిన‌ప్ప‌టికి మ‌న ఆహార‌పు అల‌వాట్ల‌ను మార్చుకోవ‌డం వ‌ల్ల స‌హ‌జ సిద్దంగా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుత‌న్నారు. శ‌రీరంలో క్యాల్షియం వంటి ల‌వ‌ణాల లోపం వ‌ల్ల కండ‌రాల తిమ్మిర్లు వ‌స్తూ ఉంటాయి. మ‌న‌లో చాలా మంది క్యాల్షియం లోపంతో కూడా బాధ‌పడుతూ ఉంటారు.

క్యాల్షియం ఉన్న ఆహారాల‌ను తీసుకోకపోవ‌డం వ‌ల్ల కండ‌రాల తిమ్మిర్లు వ‌స్తూ ఉంటాయి. రోజుకు పెద్ద‌ల‌కు 450 మిల్లీ గ్రాములు, పిల్ల‌ల‌కు 600 మిల్లీ గ్రాములు, గ‌ర్భిణీలు మ‌రియు బాలింత‌ల‌కు 900 మిల్లీ గ్రాముల క్యాల్షియం అవ‌స‌ర‌మ‌వుతుంది. క్యాల్షియంతో పాటు సోడియం, మెగ్నీషియం వంటి ల‌వ‌ణాలు త‌గ్గ‌డం వ‌ల్ల కూడా కండ‌రాల తిమ్మిర్లు వ‌స్తూ ఉంటాయి. శ‌రీరానికి ల‌వ‌ణాలు అంది తిమ్మిర్లు త‌గ్గాలంటే మ‌నం ఆకుకూర‌ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ముఖ్యంగా తోట‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కండ‌రాల తిమ్మిర్లు చాలా చ‌క్క‌గా త‌గ్గుతాయి. ఆకుకూర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల 10 రోజుల్లోనే మ‌నం మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే నువ్వుల ఉండ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా కండరాల తిమ్మిర్లు త‌గ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి క్యాల్షియంతో పాటు ఇత‌ర ల‌వ‌ణాలు కూడా అందుతాయి.

Muscle Cramps wonderful tips to follow
Muscle Cramps

దీంతో కండ‌రాల తిమ్మిర్ల నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే కండ‌రాల తిమ్మిర్ల‌తో బాధ‌ప‌డే వారు కొబ్బ‌రి నీటిని తీసుకోవాలి. కొబ్బ‌రి నీటిలో సోడియం ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో శ‌రీరానికి త‌గినంత సోడియం అంది తిమ్మిర్లు త‌గ్గుతాయి. ఈ విధంగా త‌గిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కండ‌రాల తిమ్మిర్ల స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా కండ‌రాల తిమ్మిర్లు వ‌స్తూ ఉంటాయి. శ‌రీర భాగాల‌ను క‌దిలించ‌కుండా ఉండ‌డం వ‌ల్ల ఆ భాగాల్లో కండ‌రాలు బ‌ల‌హీనంగా త‌యార‌వుతాయి.

అనుకోకుండా ఆభాగాన్ని క‌దిలించిన‌ప్పుడు కండ‌రాలు ప‌ట్టేసిన‌ట్టుగా, తిమ్మిర్లు వ‌చ్చిన‌ట్టుగా అవుతుంది. క‌నుక కండ‌రాల తిమ్మిర్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ స‌మ‌స్య రాకుండా ఉండాల‌నుకునే వారు రోజూ వ్యాయామం చేయాలి. 15 నుండి 20 నిమిషాల పాటు ఏదో ఒక వ్యాయామాన్ని త‌ప్ప‌కుండా చేయాలి. పాదాల నుండి మెడ వ‌ర‌కు శ‌రీర భాగాలు అన్ని క‌దిలేలా ఏదో ఒక వ్యాయామం చేయాలి. ఈ విధంగా త‌గిన ఆహారాల‌ను తీసుకుంటూ, వ్యాయామాలు చేయ‌డం వ‌ల్ల కండ‌రాల తిమ్మిర్ల స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts