హెల్త్ టిప్స్

Bathing : స్నానం చేసేట‌ప్పుడు ఈ సూచ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాలి.. ఎందుకంటే..?

Bathing : స్నానం చేయ‌డ‌మనేది మ‌న శ‌రీరానికి అత్య‌వ‌స‌రం. దీంతో శ‌రీర‌మంతా శుభ్ర‌మ‌వుతుంది. అనేక ర‌కాల వైర‌స్‌లు, బ్యాక్టీరియాలు నాశ‌న‌మ‌వుతాయి. రోగాలు రాకుండా ఉంటాయి. ప్ర‌తి ఒక్క‌రు రోజుకు రెండు సార్లు స్నానం చేయాల‌ని వైద్యులు చెబుతున్నారు. అది వీలు కాక‌పోతే క‌నీసం ఒక్క‌సారైనా శుభ్రంగా ఒళ్లంతా తోముకుని మ‌రీ స్నానం చేయాల‌ని వారు సూచిస్తున్నారు. అయితే చాలా మంది స్నానం స‌రైన ప‌ద్ధ‌తిలో చేయ‌డం లేదు. ఈ క్ర‌మంలో స్నానం ఎలా చేయాలో, స్నానం విష‌యంలో మ‌నం తీసుకోవాల్సిన ఇత‌ర జాగ్ర‌త్త‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది చ‌ర్మానికి వాక్సింగ్ లేదా షేవింగ్ చేశాక స్నానం చేస్తారు. కానీ అలా చేయడం స‌రి కాదు. ఎందుకంటే అలా చేయడం వల్ల చ‌ర్మం బాగా పొడిగా అవుతుంద‌ట. దీంతోపాటు చ‌ర్మం త‌న స‌హ‌జ కాంతిని కోల్పోయే ప్ర‌మాదం ఉంది. కనుక వాక్సింగ్‌, షేవింగ్ వంటివి స్నానం చేశాక పెట్టుకోవ‌డం ఉత్తమం. చాలా మంది ఏం చేస్తారంటే ముఖం లేదా ఇత‌ర శ‌రీర భాగాల‌ను స్నానం చేసేట‌ప్పుడు బాగా తోముతారు. దీంతో చ‌ర్మం అందంగా మారుతుంద‌ని, మురికి పోతుంద‌ని వారి భావ‌న‌. కానీ నిజానికి అలా చ‌ర్మాన్ని గట్టిగా తోమ‌కూడ‌దు. లేదంటే చ‌ర్మం బాగా డ్యామేజ్ అవుతుంది. చ‌ర్మంపైపొర బాగా దెబ్బ తింటుంది.

must follow these tips while bathing know why

స్నానం చేసేట‌ప్పుడు చాలా మంది స్క్ర‌బ్బ‌ర్‌తో తోముకున్నాక దాన్ని అలాగే వ‌దిలేస్తారు. కానీ అలా చేయ‌డం వ‌ల్ల అందులో ఉండే క్రిములు, బాక్టీరియా మళ్లీ స్నానం చేసినప్పుడు మ‌న‌కు వ్యాప్తి చెందుతాయి. దాంతో అనారోగ్యాల పాల‌య్యే అవ‌కాశం చాలా ఎక్కువ‌. క‌నుక ఒక‌సారి స్క్ర‌బ్బ‌ర్‌తో తోముకుని స్నానం చేశాక దాన్ని నీట్‌గా క‌డిగి పెట్టుకోవ‌డం మేలు. స్నానం చేశాక చాలా మంది ట‌వ‌ల్‌తో ప‌దే ప‌దే శ‌రీరం తుడుచుకుంటారు. అలా తుడిస్తే ప్ర‌మాద‌మ‌ట‌. చ‌ర్మం డ్యామేజ్ అవుతుంద‌ట‌. దాని పైపొర దెబ్బ తింటుంద‌ట‌. చంక‌లు, జ‌ననావ‌య‌వాలు, గజ్జ‌లు వంటి భాగాల్లో త‌ప్ప స‌బ్బును శ‌రీరంపై ఎక్కువ‌గా వాడ‌కూడ‌దు. లేదంటే స‌బ్బులో ఉండే కెమిక‌ల్స్ మ‌న శ‌రీరానికి దీర్ఘ‌కాలంలో ఎక్కువ‌గా హాని క‌లిగిస్తాయి.

చాలా మంది స్నానం చేసిన వెంట‌నే డియోడ‌రెంట్ లేదా పెర్‌ఫ్యూమ్ వాడ‌తారు. అయితే అలా వాడ‌కూడ‌ద‌ట‌. అలా చేస్తే చ‌ర్మం ఎక్కువ ఇరిటేష‌న్‌కు గుర‌వుతుంద‌ట‌. చాలా మంది వ్యాయామం చేసిన వెంట‌నే స్నానం చేస్తారు. దీంతో రిఫ్రెష్ అయిన ఫీలింగ్ క‌లుగుతుంది. అది క‌రెక్టే అయినా, వ్యాయామం చేశాక క‌నీసం గంట వ‌ర‌కు ఆగి, ఆ త‌రువాత స్నానం చేయాల‌ట‌. లేదంటే వ్యాయామం చేశాక వేడెక్కిన శ‌రీరం వెంట‌నే నీరు తగిలే స‌రికి ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల‌ను, ఇన్‌ఫెక్ష‌న్ల‌ను తెచ్చి పెడుతుంద‌ట‌. చ‌ర్మానికి మాయిశ్చ‌రైజ‌ర్ అప్లై చేశాక కొంద‌రు స్నానం చేసేందుకు ఎక్కువ స‌మ‌యం తీసుకుంటారు. అయితే అలా చేయ‌కూడ‌దు. మాయిశ్చ‌రైజ‌ర్ అప్లై చేసిన కొద్ది నిమిషాల‌కు క‌చ్చితంగా స్నానం చేయాలి. లేదంటే చ‌ర్మం ప‌గులుతుంది. బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తాయి.

చాలా మంది కేవ‌లం షాంపూతో మాత్ర‌మే త‌ల‌స్నానం చేసి అలాగే జుట్టును వ‌దిలేస్తారు. అయితే అలా కాకుండా షాంపూ చేసుకున్న వెంట‌నే జుట్టుకు కండిష‌న‌ర్‌కు పెట్టాలి. అనంత‌రం మ‌ళ్లీ త‌ల‌ను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల షాంపూ ద్వారా కోల్పోయిన జుట్టు స‌హ‌జ సిద్ధ‌మైన ఆయిల్స్ మ‌ళ్లీ వ‌స్తాయి. వెంట్రుక‌లు ప్రకాశవంతంగా మారుతాయి. మృదువుగా ఉంటాయి. జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.

Admin

Recent Posts