హెల్త్ టిప్స్

Neem Fruits : ప‌ర‌గ‌డుపున‌ రెండు పండ్లను తింటే.. ఏం అవుతుందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..!

Neem Fruits : వేప ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వేపతో, అనేక రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వేప వలన కలిగే లాభాలు చూస్తే ఆశ్చర్యపోతారు. ఆయుర్వేద వైద్యంలో కూడా, వేపని ఎక్కువగా వాడుతుంటారు. వేప ఆకులు మాత్రమే కాదు. వేప పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేప పండ్లు వలన, కలిగే లాభాలను చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ప్రాచీన కాలం నుండి కూడా, వేపని ఒక ఔషధంగా ఉపయోగించడం జరుగుతోంది. వేప ఆకుల నుండి కొమ్మల వరకు, ప్రతి భాగం కూడా, మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.

వేప పండు, ఆకు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. వేప పండు పరగడుపున తీసుకుంటే, చక్కటి ప్రయోజనాలని పొందవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు, వేప పండ్లు తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. శరీరంలో వ్యర్ధాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వేప పండ్లు ఆకులతో టీ తాగితే, కిడ్నీ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.

Neem Fruits wonderful health benefits

పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి, ఒక గ్లాసు నీళ్లు పోసి, రెండు వేప పండ్లు, మూడు వేపాకులు వేసి, ఐదు నిమిషాల పాటు మరిగించి, తర్వాత వడకట్టుకుని తాగాలి. ఇది కాస్త చేదుగా ఉంటుంది. కానీ, దీన్ని తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. మూత్రపిండాలు సమస్యలు తగ్గుతాయి. ప్రోస్టేట్ సమస్యలు తగ్గుతాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం కలుగుతుంది. దంత క్షయాన్ని కూడా పోగొడుతుంది.

పంటి నొప్పి, దంత సమస్యలు కూడా తగ్గుతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా, ఇందులో ఎక్కువ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది చూస్తుంది. వేప పండ్లు పేస్ట్ ని, జుట్టుకి పట్టించి అరగంట పాటు అలా వదిలేసి, తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేస్తే, చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు. ఇలా వేప ద్వారా అనేక లాభాలని పొందవచ్చు.

Admin

Recent Posts