Over Weight : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో అధిక బరువు సమస్య కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రస్తుత కాలంలో అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే అధిక బరువు వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెప్పడంతో చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు. అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు అధిక బరువు సమస్యను చాలా తేలికగా తీసుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఈ సమస్యపై అవగాహన రావడంతో అందరూ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యాయామం చేయడం, ఆటలు ఆడడం, యోగా, స్విమ్మింగ్ వంటి వాటిని చేయడం చక్కటి ఆహార నియమాలు పాటించడం వంటి వాటిని చేస్తూ చాలా ఎక్కువగా బరువు తగ్గుతున్నారు.
4 నుండి 5 నెలల పాటు కఠినంగా ఈ నియమాలను పాటిస్తూ అధిక బరువు సమస్య నుండి బయటపడుతున్నారు. ఇలా బరువు తగ్గగానే చాలా మంది మరలా దీనిని తేలికగా తీసుకుంటారు. ఆహార నియమాలను, వ్యాయామాలన్నింటిని పక్కకు పెట్టేసి తిరిగి సాధారణ ఆహారాన్ని తీసుకుంటున్నారు. దీంతో వారు తగ్గిన బరువు కంటే మరలా ఎక్కువగా బరువు పెరుగుతున్నారు. ఇలా అధికంగా పెరిగిన బరువును నియంత్రించుకోలేక ఇబ్బందిపడుతున్న వారు కూడా ఉన్నారు. ఈ అధిక బరువు సమస్యతో బాధపడే వారు కొన్ని కఠిన నియమాలను జీవితాంతం పాటించాలి. ఒబేసిటి ఉన్న వారికి ప్రధాన శత్రువు బియ్యం మరియు బియ్యం ఉత్పత్తులు. అలాగే చాలా మంది వారానికి మూడు సార్లు ఫ్రైడ్ రైస్, పులావ్, బిర్యానీ వంటి రకరకాల ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. తగిన బరువు మరాలా పెరగకుండా ఉండాలంటే ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.
ఎక్కువగా పుల్కాలనే తింటూ ఎప్పుడో ఒకసారి మాత్రమే అన్నాన్ని తినాలి. ఒకసారి తింటే 10 నుండి 15 రోజుల వరకు ఆ ఆహారాన్ని మరలా తీసుకోకూడదని గట్టి నిర్ణయం తీసుకోవాలి. అలాగే బిర్యానీ వంటి వాటిని తిన్నప్పుడు మరుసటి ఉపవాసం ఉండి బిర్యానీ తినడం వల్ల పెరిగిన బరువును తగ్గించాలి. ఇలా చేయడం వల్ల జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల వచ్చిన క్యాలరీలు తగ్గుతాయి. జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల పెరిగిన బరువు తగ్గే వరకు మరలా జంక్ ఫుడ్ ను తీసుకోకూడదని కఠిన నియమం పెట్టుకోవాలి. అలాగే బియ్యం ఉత్పత్తులైనటువంటి ఇడ్లీ, ఉప్మా, దోశ వంటి వాటిని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఈ పదార్థాలు కూడా అధిక క్యాలరీలను కలిగి ఉంటాయి. వీటిని కూడా ఎప్పుడో ఒకసారి మాత్రమే తీసుకోవాలి.
రోజూ సలాడ్స్, మొలకెత్తిన గింజలు వంటి వాటినే తీసుకోవాలి. అలాగే చాలా మంది సాయంత్రం భోజనాన్ని బయట చేస్తూ ఉంటారు. దీని వల్ల క్యాలరీలు పెరుగుతాయి. సాయంత్రం బయట భోజనం చేయాలనుకునే వారు ఉదయం, మధ్యాహ్నం సలాడ్ లను మాత్రమే తినాలి. మూడు పూటలా అధిక క్యాలరీలు కలిగిన ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు. ఈ నియమాలను పాటిస్తూ ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల మనం తగ్గిన బరువు మరలా పెరగకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.