Palleru Kayalu With Milk : పాల‌లో దీన్ని క‌లిపి తాగితే.. షుగ‌ర్, గుండె స‌మ‌స్య‌లు, కిడ్నీ వ్యాధులు ఉండ‌వు..

Palleru Kayalu With Milk : ప్ర‌స్తుత కాలంలో కీళ్ల నొప్పులు, షుగ‌ర్, బీపీ, అధిక బ‌రువు, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వంటి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో చాలా మంది స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈ అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్ని త‌లెత్త‌డానికి మారిన జీవ‌న విధానం, మ‌న ఆహార‌పు అల‌వాట్లే కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్ని మ‌నం ఒక ఇంటి చిట్కాతో న‌యం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. నేటి త‌రుణంలో చిన్న వ‌య‌సులోనే చాలా మంది దీర్ఘ‌కాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు అలాగే భ‌విష్య‌త్తులో ఎటువంటి అనారోగ్య స‌మ‌స్ల‌య బారిన ప‌డ‌కూడ‌దు అనుకునే వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

మ‌న‌కు ఆరోగ్యాన్ని అందించే ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ప‌ల్లేరు కాయ‌ల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ప‌ల్లేరు చెట్టును మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వీటిని వాడ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేరుకుండా ఉంటాయి. అచితే ఈ ప‌ల్లేరు కాయ‌ల‌ను ఎలా ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Palleru Kayalu With Milk take for amazing benefits
Palleru Kayalu With Milk

దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాల‌ను తీసుకుని వేడి చేయాలి. పాలు వేడ‌య్యాక ఇందులో 3 నుండి 4 పెద్ద ప‌ల్లేరు కాయ‌ల‌ను పొడిగా చేసుకుని వేయాలి. ఇవి నాలుగుకు మించి ఉండ‌కుండ చూసుకోవాలి. త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి ఈ పాల‌ను మూడు పొంగుల వ‌చ్చే వ‌ర‌కు బాగా మ‌రిగించాలి. ప‌ల్లేరు కాయ‌లు చ‌లువ చేసే గుణాన్ని క‌లిగి ఉంటాయి. సెగ వ్యాధికి, మూత్ర‌పిండాల స‌మ‌స్య‌ల‌కు ప‌ల్లేరుకాయ‌లు చ‌క్క‌టి ఔష‌ధంలా ప‌ని చేస్తాయి. పాలు మరిగిన త‌రువాత వీటిని వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తీపి కొర‌కు ఇందులో ప‌టిక బెల్లాన్ని లేదా తేనెను క‌లుపుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసుకున్న పాల‌ను ప్ర‌తిరోజూ ఉద‌యాన్నే తీసుకోవాలి. అలాగే ఈ ప‌ల్లేరు కాయ‌ల పొడిని ఎప్ప‌టిక‌ప్పుడు తాజాగా త‌యారు చేసుకోవాలి. ఇలా పాల‌ను వారానికి నాలుగు సార్లు త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల కాలేయం శుభ్ర‌ప‌డుతుంది.

మూత్రపిండాల్లో రాళ్ల స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. స్త్రీలు ఈ పాలను తీసుకోవ‌డం వ‌ల్ల నెల‌స‌రి స‌మ‌స్య‌లు, గ‌ర్భాశ‌య స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో, శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌డంలో, గుండె స‌మ‌స్య‌ల‌ను తొల‌గించ‌డంలో ఈ ప‌ల్లేరు కాయ‌ల‌తో చేసిన పాలు మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. కంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, నోటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా పల్లేరు కాయ‌లు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ విధంగా ప‌ల్లేరు కాయ‌ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతో పాటు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి.

D

Recent Posts