Papaya : ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండ్లను అస్సలు తినరాదు.. లేదంటే ప్రమాదం కలుగుతుంది..!

Papaya : మనకు అందుబాటులో ఉంటూ సులభంగా లభించే అనేక రకాల పండ్లలో బొప్పాయి పండ్లు ముందు వరుసలో నిలుస్తాయని చెప్పవచ్చు. వీటిల్లో ఫైబర్‌, విటమిన్లు, మినరల్స్‌ అదికంగా ఉంటాయి. అందువల్ల అత్యంత అధికమైన పోషకాలు ఉండే పండ్లలో బొప్పాయిని ఒకటిగా న్యూట్రిషనిస్టులు చెబుతుంటారు. వీటిని బాగా పండిన తరువాత తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఇక బొప్పాయి పండ్లు మనకు సీజన్లతో సంబంధం లేకుండా ఏ సీజన్‌లో అయినా సరే లభిస్తాయి.

Papaya : ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండ్లను అస్సలు తినరాదు.. లేదంటే ప్రమాదం కలుగుతుంది..!
Papaya

బొప్పాయి పండ్లను తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్, క్యాన్సర్‌, లో బీపీ వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే అధిక బరువు తగ్గుతారు. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.

బొప్పాయి పండ్ల వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ వాటిని కొందరు తినరాదు. ముఖ్యంగా గర్భిణీలు బొప్పాయి పండ్లను తినరాదు. ఎందుకంటే.. ఈ పండ్లలో ఉండే లేటెక్స్‌ గర్భాశయంపై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఈ పండ్లలోని పపైన్‌ అనే ఎంజైమ్‌ కూడా పిండంపై ప్రభావం చూపిస్తుంది. కనుక గర్భిణీలు బొప్పాయి పండ్లను తినరాదు.

Papaya

ఇక హైపో థైరాయిడిజం సమస్య ఉన్నవారు, అసాధారణ రీతిలో గుండె కొట్టుకునే సమస్య ఉన్నవారు కూడా బొప్పాయి పండ్లను తినరాదు. ఎందుకంటే ఈ పండ్లలో సయనోజెనిక్‌ గ్లైకోసైడ్స్‌ ఉంటాయి. అవి ఆయా సమస్యలు ఉన్నవారికి తీవ్ర దుష్పరిణామాలను కలిగించే అవకాశాలు ఉంటాయి. కనుక ఆయా సమస్యలు ఉన్నవారు కూడా బొప్పాయి పండ్లను తినరాదు.

అలర్జీలు ఉన్నవారు, కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారు కూడా ఈ పండ్లను తినరాదు. బొప్పాయి పండ్లలో ఉండే లేటెక్స్‌ కొందరికి అలర్జీలను కలిగిస్తుంది. కనుక ఈ పండ్లను తిన్నవారు అలర్జీ వస్తుంటే వెంటనే వీటిని తినడం మానేయాలి.

బొప్పాయి పండ్లలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. కిడ్నీ స్టోన్లు ఉన్నవారు ఈ పండ్లను తింటే స్టోన్స్‌ మరింత ఎక్కువయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక ఈ సమస్య ఉన్నవారు కూడా బొప్పాయి పండ్లను తినరాదు. లో బీపీతో బాధపడుతున్నవారు ఈ పండ్లను తింటే బీపీ మరింత పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లోబీపీ బాధితులు బొప్పాయి పండ్లను తినరాదు.

Admin

Recent Posts