Brinjal : వంకాయ‌లను వీరు అస‌లు తిన‌కూడ‌దు.. ఎందుకంటే..?

Brinjal : కూరగాయ‌ల‌లో మ‌న‌కు విరివిగా దొరికేది వంకాయ‌. దీనిని చూస్తేనే కొంద‌రికి ఎల‌ర్జీ వ‌స్తుంది. మ‌రి కొంద‌రు దీంతో ఎన్నో ర‌కాల వెరైటీస్ చేసుకుంటారు. కూరగాయల్లో రారాజు ఎవరంటే వంకాయే అంటారు. ఎందుకంటే వంకాయతో ఎన్నో ర‌కాల వంట‌కాలు చేసుకోవ‌చ్చు. విటమిన్ ఎ అధికంగా ఉండే వంకాయ కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. వంకాయలో విటమిన్ ఇ మరియు కె పుష్కలంగా ఉన్నాయి, ఇవి శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని అనుమతించవు. రక్త ప్రసరణను చురుగ్గా ఉంచుతుంది. కొన్ని అనారోగ్య సమస్యలు కలిగిన వారు వంకాయను తినకూడదు, ఎందుకంటే వంకాయతో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఇది వారికి ప్రమాదకరంగా పరిణమించే అవ‌కాశం ఉంది. అయితే వంకాయ‌ని ఎవ‌రెవ‌రు తిన‌కూడ‌దు అంటే..

ముందుగా మీకు ఏదైనా ఫుడ్ అలెర్జీ ఉన్నట్లయితే, వంకాయను తినవద్దు, ఎందుకంటే దీనిని తినడం వల్ల అలర్జీ సమస్య మరింత తీవ్రమవుతుంది.వంకాయ‌ని దూరంగా పెడితే మీకు అల‌ర్జీ స‌మ‌స్య‌లు దూరం అవుతాయ‌ని వైద్యులు కూడా సూచ‌న చేస్తారు. మీరు డిప్రెషన్ మెడిసిన్ తీసుకుంటుంటే లేదా ఆందోళనతో బాధపడుతుంటే వంకాయ తినడం విర‌మించుకోవ‌డం మంచిది. ఈ కూరగాయ రోగులలో డిప్రెషన్ మరింత పెంచుతుంది, కౌంటర్ మందుల ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. మీ శరీరంలో రక్తం స్థాయి తక్కువగా ఉంటే, మీరు వంకాయలకు దూరంగా ఉంటే మంచిది. వంకాయలోని సమ్మేళనాలు శరీరంలో రక్తం వృద్ధికి అడ్డంకిగా పనిచేస్తాయి.

people with these problems should not take brinjal
Brinjal

వంకాయలో అధిక మొత్తంలో పొటాషియం ఉండ‌డం వ‌ల‌న‌ మన దైనందిన జీవితంలో అవసరమయ్యే పొటాషియంలో 29 శాతం 458 గ్రాముల వంకాయలో లభిస్తుంది. కాని వంకాయ ఎక్కువగా తినడం వల్ల వికారం లేదా వాంతులు సమస్యలు వస్తాయి.మీకు రాళ్లు ఉంటే, వంకాయను అస్సలు తినవద్దు. వంకాయలో ఉండే ఆక్సలేట్ రాళ్ల సమస్యను ఇంకా తీవ్రతరం చేస్తుంది. జ్వరంగా ఉన్నప్పుడు కూడా వంకాయను అసలు తీసుకోకూడదు. వంకాయ తింటే శరీరంలో ఉష్ణోగ్రత మ‌రింత పెరిగేలా చేస్తుంది. అందుకే ఫీవర్‌గా ఉన్నప్పుడు మీ డైట్‌లో వంకాయను తీసుకోకుండా ఉండటమే మంచిది. ఇలా మీకు ఏవైన స‌మ‌స్య‌లు ఉండిఉంటే వంకాయని దూరం పెట్ట‌డం మంచిది.

Sam

Recent Posts