Pepper Powder : మిరియాల పొడి చేసే మ్యాజిక్ ఇది.. ఇలా వాడితే షుగ‌ర్‌, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి..!

Pepper Powder : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వంట‌లు రుచిగా ఉండ‌డానికి వాటిలో ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను వేస్తూ ఉంటాము. వాటిలో కారం కూడా ఒక‌టి. కారం కూర‌కే చ‌క్క‌టి రుచిని తీసుకు వ‌స్తుంది. కారం లేని కూర‌ల‌ను మ‌నం తిన‌లేము. అయితే కూర‌ల్లో ఎండు మిర‌ప‌కాయ‌ల‌తో చేసిన కారం పొడిని వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఎండుమిర‌ప‌కాయ‌లు, అలాగే వాటితో చేసే కారం పొడి మ‌న‌కు చెడునే ఎక్కువ చేస్తాయ‌ని వారు తెలియ‌జేస్తున్నారు. మిర‌పకాయ‌లు ప‌చ్చిగా ఉన్న‌ప్పుడు వాటిలో 50 శాతం కారం ఉంటుంద‌ని, అవి పండిన త‌రువాత వాటిలో కారం 75 శాతంగా ఉంటుంద‌ని అలాగే అవి పూర్తిగా ఎండి ఎండుమిర‌ప‌కాయ‌లుగా అయిన త‌రువాత వాటిలో 100 శాతం కారం ఉంటుంద‌ని వారు చెబుతున్నారు. ప‌చ్చిమిరప‌కాయలు ఎండే కొద్ది వాటిలో నీటి శాతం త‌గ్గి ఘాటు శాతం పెరుగుతూ ఉంటుంది.

మ‌నం వంట‌ల్లో ఎండు మిర‌ప‌కాయ‌ల‌తో చేసే చిల్లీ ప్లేక్స్ ను వేస్తూ ఉంటాము. ఇవి మ‌న పొట్ట‌లోకి వెళ్లిన‌ప్ప‌టికి అవి జీర్ణం కావ‌ని ఎలా తినామో అలానే మ‌లం ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని వారు చెబుతున్నారు. కూర‌ల్లో ఎండు కారం పొడికి బ‌దులుగా ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను వాడ‌డం మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొంద‌రికి ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల కారం ఏ మాత్రం ప‌డ‌దు. అలాంటి వారు ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌కు అలాగే వంట‌ల్లో ఎండు కారం పొడిని బ‌దులుగా మిరియాల పొడిని ఉప‌యోగించ‌వ‌చ్చు. అసలు పూర్వ‌కాలంలో వంట‌ల్లో కారానికి బ‌దులుగా మిరియాల పొడినే వాడేవార‌ని నిపుణులు చెబుతున్నారు. అసిడిటీ, ప్రేగు పూత‌లు, అల్స‌ర్లు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎండు కారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య మ‌రింత తీవ్ర‌మ‌వుతుంది. అలాంటి సంద‌ర్భాల్లో ఎండు కారాన్ని పూర్తిగా మానేయాలి. సాధార‌ణంగా ఎండు కారానికి బ‌దులుగా వంట‌ల్లో మిరియాల పొడి, ప‌చ్చి కారాన్ని వాడ‌డ‌మే మంచిద‌ని వారు చెబుతున్నారు.

Pepper Powder benefits in telugu how to use this
Pepper Powder

వంట‌ల్లో మిరియాల పొడిని వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఇంటి చిట్కాల్లో అలాగే ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేట‌ప్పుడు మ‌నం మిరియాల‌తో క‌షాయాన్ని, మిరియాల పాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటాము. మిరియాల్లో పెప్ప‌రిన్ అనే ర‌సాయ‌నం ఉంటుంది. ఇది అల‌ర్జీల‌కు కార‌ణ‌మ‌య్యే హిస్ట‌మిన్ ఉత్ప‌త్తిని త‌గ్గిస్తుంది. దీంతో శ్లేష్మం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌దు. దీంతో మ‌న‌కు ద‌గ్గు త‌గ్గుతుంది. అలాగే మిరియాల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. మ‌తిమ‌రుపు, అల్జీమ‌ర్స్ వంటి స‌మ‌స్య‌లు రాకుండా చేయ‌డంలో కూడా మిరియాలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి.

అలాగే 8 వారాల పాటు త‌గినమోతాదులో మిరియాల పొడిని ఉప‌యోగించ‌డం వల్ల డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు 50 శాతం వ‌ర‌కు త‌గ్గుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. మిరియాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. ఈ విధంగా మిరియాలు మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయని వంట‌ల్లో కారానికి బ‌దులుగా మిరియాల పొడిని ఉప‌యోగించ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts