Plaque In Arteries : వీటిని తీసుకుంటే చాలు.. బీపీ ఎంత ఉన్నా త‌గ్గిపోతుంది.. ర‌క్త‌నాళాల్లో కొలెస్ట్రాల్ అస‌లే ఉండ‌దు..!

Plaque In Arteries : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లల్లో అధిక ర‌క్త‌పోటు కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. అధిక రక్త‌పోటును సైలెంట్ కిల్ల‌ర్ గా వైద్యులు అభివ‌ర్ణిస్తూ ఉంటారు. అధిక ర‌క్త‌పోటు కార‌ణంగా గుండెతో పాటు శ‌రీరానికి కూడా ఎంతో హాని క‌లుగుతుంది. క‌నుక అధిక ర‌క్త‌పోటును ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఈ స‌మ‌స్య త‌లెత్తిన వెంట‌నే నిర్ల‌క్ష్యం చేయ‌కుండా త‌ప్పకుండా వైద్యున్ని సంప్ర‌దించి త‌గిన చికిత్స తీసుకోవాలి. మందులు త‌ప్ప‌కుండా వాడాలి. మందులు వాడుతూ, చ‌క్క‌టి జీవ‌న‌విధానాన్ని, ఆహార‌పు అలవాట్ల‌ను పాటిస్తూ ఉండ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా అధిక ర‌క్తపోటును అదుపులో ఉంచుకోవ‌చ్చు.

అయితే ఇవే కాకుండా వీటితో పాటు కొన్ని ర‌కాల పానీయాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ధిక ర‌క్తపోటును అదుపులో ఉంచుకోవ‌చ్చు. అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారు ఈ పానీయాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు కూడా చెబుతున్నారు. అధిక ర‌క్తపోటును అదుపులో ఉంచే పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక ర‌క్తపోటును త‌గ్గించ‌డంలో కొవ్వు లేని పాలు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ పాలల్లో ఉండే క్యాల్షియం, విట‌మిన్ డి పొటాషియం వంటి పోష‌కాలు 3 నుండి 10 శాతం వ‌ర‌కు అధిక ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొవ్వు త‌క్కువ‌గా ఉండే పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు భ‌విష్య‌త్తులో కూడా అధిక ర‌క్తపోటు స‌మ‌స్య రాకుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Plaque In Arteries and high blood pressure take these daily
Plaque In Arteries

అలాగే ఆపిల్ సైడ‌ర్‌ వెనిగ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా అధిక ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి పోష‌కాలు ఉంటాయి. ఇవి ర‌క్త‌పోటును త‌గ్గించ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. అలాగే ఆపిల్ సైడ‌ర్‌ వెనిగ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా ఉండే సోడియంతో పాటు వ్య‌ర్థాలు కూడా బ‌య‌ట‌కు పోతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. రోజూ 3 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడ‌ర్‌ వెనిగ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉండ‌డంతో పాటు మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ర‌క్త‌పోటు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు చియా విత్తనాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. చియా విత్త‌నాల‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌తో పాటు క్లోరోజెనిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.

ఇవి ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఒక గ్లాస్ నీటిలో చియా విత్త‌నాల‌ను వేసి అర‌గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి తాగాలి. ఈ నీటిలో నిమ్మ‌ర‌సాన్ని కూడా వేసుకోవ‌చ్చు. ఇలా నెల‌రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. అలాగే దానిమ్మ‌గింజ‌ల జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల కూడా అధిక ర‌క్తపోటు అదుపులో ఉంటుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌నాళాల్లో ఉన్న అడ్డంకుల‌ను తొల‌గించ‌డంలో దానిమ్మ గింజ‌లు జ్యూస్ మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. నెల రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా దానిమ్మ‌గింజ‌ల జ్యూస్ ను తీసుకోవ‌డం వ‌ల్ల అధిక ర‌క్త‌పోటు అదుపులోకి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ జ్యూస్ లో పంచ‌దార వంటి వాటిని వేయ‌కుండా వీలైనంత వ‌ర‌కు ఇంట్లోనే త‌యారు చేసుకుని తాగాల‌ని వారు చెబుతున్నారు.

అలాగే గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మ‌ర‌సం కలిపి తీసుకోవ‌డం వ‌ల్ల కూడా అధిక ర‌క్తపోటు అదుపులో ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది బ‌రువు త‌గ్గ‌డానికి , శ‌రీరంలో మెట‌బాలిజం రేటు పెర‌గ‌డానికి మాత్ర‌మే నీటిని తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల పూర్తి శ‌రీరానికి మేలు క‌లుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మెంతి నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ర‌క్తపోటు అదుపులో ఉంటుంది. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మెంతుల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఈ నీటిని ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి. ఇలా మెంతుల నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అధిక ర‌క్తపోటు స‌మ‌స్య త‌గ్గుతుంది. ఈ విధంగా ఈ పానీయాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అధిక రక్త‌పోటు ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంటుంద‌ని చెబుతున్నారు.

D

Recent Posts