Poppy Seeds For Pain : మారిన జీవన విధానం కారణంగా మనలో చాలా మంది కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్నారు. తీవ్రమైన ఈ నొప్పుల కారణంగా పనులు చేసుకోలేక అనేక మంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే చాలా మంది ఈ నొప్పుల నుండి బయట పడడానికి పెయిన్ కిల్లర్ లను ఎక్కువగా వాడుతున్నారు. కొందరైతే నొప్పులను తట్టుకోలేక మూడు పూటలా ఈ పెయిన్ కిల్లర్ లను వేసుకుంటూ ఉంటారు. అయితే పెయిన్ కిల్లర్ లను దీర్ఘకాలం పాటు వాడడం వల్ల మనం అనేక దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పెయిన్ కిల్లర్ లను వాడడం వల్ల పొట్టలో మేలు చేసే బ్యాక్టీరియా నశిస్తుంది.
అలాగే అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలేయం ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక ఈ పెయిన్ కిల్లర్ లను వీలైనంత వరకు ఉపయోగించకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే పెయిన్ కిల్లర్ లను వాడకుండా సహజ సిద్దంగా కూడా నొప్పులను తగ్గించుకోవచ్చని వారు తెలియజేస్తున్నారు. పెయిన్ కిల్లర్ లకు బదులుగా గసగసాలను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గసగసాల్లో మార్ఫిన్, కోడైన్ అనే ఆల్కలాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఆల్కలాయిడ్స్ సహజసిద్ద పెయిన్ కిల్లర్స్ గా పని చేస్తాయి. గసగసాలను వాడడం వల్ల నొప్పిని తెలియజేసే రిసెప్టార్స్ శాంతించబడతాయి.
దీంతో ఈ రిసెప్టార్స్ నరాల ద్వారా తక్కువ నొప్పిని మెదడుకు చేరవేస్తాయి. దీంతో మనకు నొప్పి తగ్గిన భావన కలుగుతుంది. నొప్పులతో బాధపడే వారు గసగసాలను తీసుకోవడం వల్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ గసగసాలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం… ఈ గసగసాలను పేస్ట్ గా చేసి ఒక కప్పు పాలల్లో వేసి కలపాలి. ఇందులో తేనె కూడా వేసి కలిపి రోజూకు రెండు పూటలా తీసుకోవాలి. నొప్పుల తీవ్రతను బట్టి తగిన మోతాదులో తగు రీతిలో తీసుకోవాలి. ఈ విధంగా నొప్పులతో బాధపడే వారు పెయిన్ కిల్లర్స్ కు బదులుగా గసగసాలను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజ సిద్దంగా నొప్పుల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.