Pregnant Woman : కడుపుతో ఉన్న వారి కోరిక తప్పక తీర్చాల‌ట.. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

Pregnant Woman : గ‌ర్భం ధ‌రించింది అని తెలియ‌గానే మ‌హిళ‌ను ఇంట్లో అందరూ అపురూపంగా చూసుకుంటారు. కాలు కింద పెట్ట‌కుండా సేవ‌లు చేస్తారు. ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య ప‌రీక్ష‌లు చేయిస్తూ త‌ల్లిని, క‌డుపులో ఉన్న బిడ్డ‌ను ఆరోగ్యంగా ఉండేలా చూస్తారు. మాతృత్వం ఒక వ‌రం. అది కొంద‌రు మ‌హిళ‌ల‌కు ల‌భించ‌దు. క‌నుక అమ్మ అయిన వారు బిడ్డ విష‌యంలో అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఇక వారి చుట్టూ ఉండేవారు కూడా ఆమెను ఎంతో అపురూపంగా చూస్తారు. బిడ్డ పుట్టే వ‌ర‌కు రెండు ప్రాణాల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటారు.

ఇక గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌లు ఆరోగ్యంగా ఉండేందుకు.. క‌డుపు లోప‌ల శిశువు ఆరోగ్యానికి, ఎదుగుద‌ల‌కు వారు నిత్యం పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తినాల్సి ఉంటుంది. వారికి అనేక ర‌కాల ప‌దార్థాల‌ను తినాల‌ని అనిపిస్తుంటుంది. అందుక‌నే అనేక కోరిక‌లను కోరుతుంటారు. ఈ క్ర‌మంలోనే వారికి ఏవి అవ‌స‌ర‌మో వాటిని కొని తెచ్చి పెడుతుంటారు. అయితే వాస్త‌వానికి ఆ స‌మ‌యంలో త‌ల్లిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. క‌నుక వారు ఏవి అడిగినా వెంట‌నే తెచ్చి పెట్టాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అస‌లు ఇలా ఎందుకు తెచ్చి పెట్టాలంటే..

Pregnant Woman wishes must be fulfilled know why
Pregnant Woman

గ‌ర్భం ధ‌రించిన వెంట‌నే కొన్ని రోజుల‌కు త‌ల్లులకు అనేక ప‌దార్థాల‌ను తినాల‌ని అనిపిస్తుంటుంది. కార‌ణం.. వారిలో పెరుగుతున్న బిడ్డ‌నే అని చెప్ప‌వ‌చ్చు. బిడ్డ లోప‌ల త‌ల్లితో అనుసంధాన‌మై ఉంటుంది. కాబ‌ట్టి బిడ్డ స్పంద‌న‌ల‌ను బ‌ట్టే త‌ల్లికి వివిధ ర‌కాల ఆహారాల‌ను తినాల‌ని అనిపిస్తుంది. అవ‌న్నీ బిడ్డ కోరిన‌ట్లే అనుకోవాలి. క‌నుక‌నే త‌ల్లి ఏం అడిగినా స‌రే వెంట‌నే తెచ్చి పెట్టాల‌ని చెబుతున్నారు. అప్పుడే బిడ్డ బాగా సంతృప్తి ప‌డుతుంద‌ట‌. ఆరోగ్యంగా పెరుగుతుంద‌ట‌. క‌నుక గ‌ర్భం ధ‌రించిన వారు ఏం అడిగినా స‌రే కాద‌న‌కుండా చేయాలి.

Editor

Recent Posts