Protein Foods : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో ప్రోటీన్ కూడాఒకటి. కణాల పెరుగుదలకు వాటి నిర్మాణానికి, ఎముకలను ధృడంగా ఉంచడంలో, హార్మోన్లను ఉత్పత్తిలో, ఎంజైమ్ ల తయారీలో ఇలా అనేకరకాలుగా ప్రోటీన్ మనకు సహాయపడుతుంది. మన శరీరానికి ప్రోటీన్ ఎంతో అవసరం. మన శరీరానికి ఒక కిలో బరువుకు ఒక గ్రాము ప్రోటీన్ అవసరమవుతుంది. అయితే ప్రోటీన్ కలిగిన ఆహారం అనగానే అందరికి చేపలే గుర్తుకు వస్తాయి. చేపలల్లో ప్రోటీన్ ఉన్నప్పటికి అందరూ వీటిని ఆహారంగా తీసుకోలేరు. చేపల కంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలు కూడా అనేకంగా ఉంటాయి. చేపలు వంటి మాంసాహారంతో పాటు వృక్ష సంబంధిత ఆహారాల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మనం మన శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడకుండా చూసుకోవచ్చు.
చేపల కంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఇతర ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో సోయాబీన్స్ కూడా ఒకటి. 100గ్రాముల సోయాబీన్స్ లో 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల తగినంత ప్రోటీన్ ను పొందవచ్చు. చికెన్ లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 100గ్రాముల చికెన్ లో 31 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఫిట్ గా ఉండాలనుకునే వారు చికెన్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పల్లీలల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పల్లీలల్లో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పల్లీలను నానబెట్టి లేదా ఉడికించి తీసుకోవడం వల్ల ప్రోటీన్ లోపం రాకుండా చూసుకోవచ్చ. కోడిగుడ్డులో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాములకు గాను 13గ్రాముల ప్రోటీన్ ను గుడ్లు అందిస్తాయి. వీటిని ఉడికించి తీసుకోవడం మంచిది. బాదంపప్పులను తీసుకోవడం వల్ల కూడా మనం తగినంత ప్రోటీన్ ను పొందవచ్చు.
100 గ్రాముల బాదంపప్పులో 21గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిని నీటిలో నానబెట్టి పైన పొట్టును తీసేసి తినడం వల్ల ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలను కూడా పొందవచ్చు. పాల నుండి తయారు చేసే చీజ్ లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 100గ్రాముల ప్రోటీన్ లో 11గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చీజ్ ను సలాడ్ వంటి వాటితో కలిపి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. శనగలల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. 100గ్రాముల శనగలల్లో 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిని ఉడికించి సలాడ్, సూప్ లేదా కూరగా చేసి తీసుకోవడం వల్ల తగినంత ప్రోటీన్ ను పొందవచ్చు. ప్రోటీన్ కలిగి ఉండే ఆహారాల్లో గుమ్మడిగింజలు కూడా ఒకటి. 100గ్రాముల గుమ్మడి గింజలల్లో 19గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. సలాడ్స్, పెరుగు, ఓట్ మీల్ వంటి వాటిపై ఈ గింజలను చల్లి తీసుకోవచ్చు. పెరుగులో కూడా ప్రోటీన్ ఉంటుంది .
100 గ్రాముల పెరుగులో 11 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పెరుగును తీసుకోవడం వల్ల ప్రోటీన్ తో పాటు క్యాల్షియం వంటి ఇతర పోషకాలను కూడా పొందవచ్చు. పప్పులల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాములకు గానూ 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. రోజూ మన భోజనంలో పప్పుదినుసులు ఉండేలా చూసుకోవడం వల్ల ప్రోటీన్ లోపం రాకుండా చూసుకోవచ్చు. ఇక పాలల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల పాలల్లో 8గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఓట్స్ కూడా ప్రోటీన్ ను కలిగి ఉంటాయి. 100గ్రాముల ఓట్స్ లో 26గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మనం ప్రోటీన్ తో పాటు మన శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలను కూడా పొందవచ్చు.