Roasted Chana : వేయించిన శనగల్ని తీసుకోవడం వలన, ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి. అప్పుడప్పుడు, చాలామంది టైంపాస్ కోసం, వేయించిన శనగల్ని తింటూ ఉంటారు. పూర్వకాలం నుండి, కూడా వేయించిన శనగలని తినేవారు. ఏదైనా ప్రయాణ సమయంలో, కూడా చాలామంది వేయించిన శనగల్ని తీసుకువెళ్లి, తింటూ ఉంటారు. ఇది చాలా ఆరోగ్యకరమైన స్నాక్ అని చెప్పొచ్చు. వేయించిన శనగల్ని తీసుకుంటే, బరువు తగ్గడానికి కూడా అవుతుంది. వేయించిన శనగలను తీసుకుంటే, ఎటువంటి లాభాలను పొందవచ్చు..?, ఎటువంటి సమస్యలకి దూరంగా ఉండవచ్చు అనే ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వేయించిన శనగల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. వేయించిన శెనగల్ని తీసుకుంటే, బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. వేయించిన శెనగలను తీసుకుంటే, అజీర్తి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఫైబర్, ప్రోటీన్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన ఆకలి వేయదు. కడుపు నిండుగా ఉంటుంది.
అజీర్తి సమస్యలను కూడా, ఇది పోగొడుతుంది. ఈ శనగల్ని తీసుకోవడం వలన గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. హృదయ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టాలంటే, కచ్చితంగా రెగ్యులర్ గా వీటిని తీసుకోండి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా, వీటిని తీసుకుంటే, కంట్రోల్ లో ఉంటాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఫైబర్ వీటిలో ఎక్కువగా ఉంటుంది.
రెగ్యులర్ గా వీటిని తీసుకుంటే మంచిది. మరి, ఈ శనగల్ని తీసుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలని పొందవచ్చు అనేది చూశారు కదా.. రెగ్యులర్ గా వీటిని స్నాక్స్ కింద తీసుకోండి. అప్పుడు ఈ సమస్యలన్నింటికీ దూరంగా ఉండవచ్చు. పచ్చిశనగల్ని ఉడకపెట్టుకొని తీసుకుంటే కూడా మంచిదే. చిన్నపిల్లలకి స్నాక్స్ పెట్టేటప్పుడు, ఉడకపెట్టిన శెనగలని మీరు పెట్టొచ్చు. లేదంటే, శనగలతో చాట్ చేయొచ్చు. శనగలతో మార్చి మార్చి రకరకాల రెసిపీస్ ని ట్రై చేసి, పిల్లలకి పెడితే, ఖచ్చితంగా పిల్లలు తినడానికి ఇష్టపడతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.