మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎంతో కష్టపడి ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీలో పైకి వచ్చారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ తన సత్తాను చాటుతూ మెగాస్టార్ అయ్యారు. అప్పట్లో ఎన్‌టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలకు పోటీగా చిరంజీవి సినిమాలు వచ్చేవి. వారి నుంచి ఎంత పోటీ ఉన్నా సరే చిరంజీవి సినిమాలు హిట్ అయ్యేవి. అంతలా ఆయన ఇండస్ట్రీలో నిలబడ్డారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ అంటే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డ్యాన్స్ ఎంత బాగా చేస్తారు అంటే.. ఆయన డ్యాన్స్ చూసేందుకే సినిమాలకు వెళ్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన అంతలా స్టార్‌గా మారడానికి ఆయన డ్యాన్స్ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈ వయస్సులోనూ ఆయన యంగ్ హీరోలకు సమానంగా డ్యాన్స్‌లు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి చెందిన ఓ విషయం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అదేమిటంటే..
ప్రస్తుతం చిరంజీవి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్క అభిమానికి ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవి ఫేవరెట్ ఫుడ్ ఏమిటి అనే విషయానికి సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవికి సీఫుడ్ అంటే చాలా ఇష్టమట. సముద్రపు ఆహారాన్ని తినేందుకు ఆయన ఎక్కువగా ఇష్టపడతారట. సముద్రపు చేపలు, రొయ్యలు అంటే చిరు బాగా ఇష్టంగా తింటారట. ఇక ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్ళినా కూడా ఆయన సీఫుడ్ ను తినడానికే ఎక్కువగా ఇష్టపడతారట. ఇలా ఈ విషయం తెలిసే సరికి ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సముద్రపు ఆహారాన్ని ఎక్కువగా తింటారా.. అని షాకవుతున్నారు. ఇక చిరు ప్రస్తుతం విశ్వంభర చేస్తున్నారు. త్వరలోనే ఆ మూవీ విడుదల కానుంది.