Sabja Seeds Drink : రోజుకు రెండు సార్లు దీన్ని తాగితే చాలు.. ఎలాంటి పొట్ట అయినా స‌రే క‌రిగిపోతుంది..!

Sabja Seeds Drink : మ‌న ఇంట్లోనే ఒక చ‌క్క‌టి పానీయాన్ని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు. ఈ పానీయాన్ని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రిగి మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అధిక పొట్ట‌, అధిక బ‌రువు స‌మ‌స్య‌తో ప్రస్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తే స‌మ‌స్య‌ల‌ల్లో ఇది ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రు అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నారు. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అనేక ర‌కాల డైటింగ్ ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. ఆహారాన్ని త‌క్కువ‌గా తీసుకుంటారు. స‌రైన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గిన‌ప్ప‌టికి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది.

క‌నుక మ‌నం ఆరోగ్యంగా బ‌రువు త‌గ్గాలి. కింద చెప్పే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా పొట్ట ద‌గ్గ‌ర అలాగే శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు. చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అలాగే ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు. అధిక బ‌రువును త‌గ్గించే చ‌క్క‌టి పానీయం ఏమిటి.. దీనిని ఎలా త‌యారు చేసుకోవాలి..ఎలా వాడాలి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక టీ స్పూన్ స‌బ్జా గింజ‌ల‌ను, అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని, అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని, ఒక టీ స్పూన్ తేనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ స‌బ్జా గింజ‌ల‌ను వేసి క‌ల‌పాలి. వీటిని అర గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఇందులో దాల్చిన చెక్క పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో నిమ్మ‌ర‌సం, తేనె వేసి క‌ల‌పాలి.

Sabja Seeds Drink take daily two times to melt belly fat
Sabja Seeds Drink

ఇలా చేయ‌డం వ‌ల్ల కొవ్వును క‌రిగించే పానీయం త‌యార‌వుతుంది. దీనిని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. దీనిని తాగిన 40 నిమిషాల వ‌ర‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అలాగే దీనిని ఉద‌యంతో పాటు రాత్రి భోజ‌నం చేసిన ఒక గంట త‌రువాత తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల పొట్టతో పాటు శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు అంతా క‌రిగిపోతుంది. మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం బ‌రువు త‌గ్గ‌డంతో పాటు ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా సొంతం చేసుకోవ‌చ్చు. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను ఈ విధంగా వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts