Saggubiyyam : సగ్గు బియ్యం.. ఇవి మనందరికీ తెలిసినవే. వీటిని మనం అప్పుడప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ తీసుకుంటూ ఉంటాం. చూడడానికి తెల్లగా, గుండ్రంగా ఉండే ఈ సగ్గు బియ్యాన్ని కర్ర పెండలం నుండి తయారు చేస్తారు. వీటితో ఉప్మా, పాయసం వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాం. సగ్గు బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. సగ్గు బియ్యంలో మనకు అవసరమయ్యే పోషకాలతోపాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
అయితే సగ్గుబియ్యాన్ని ఏ విధంగా తీసుకుంటే మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో గుప్పెడు సగ్గు బియ్యాన్ని తీసుకుని వాటిని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి సగ్గు బియ్యాన్ని ఒకటి లేదా రెండు గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను పోసి వేడి చేయాలి. పాలు వేడయ్యాక నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసి 10 నుండి 15 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. తరువాత దీనిలో తీపి కొరకు బెల్లాన్ని కానీ, పటిక బెల్లాన్ని కానీ ఉపయోగించవచ్చు. పంచదారను మాత్రం తీపి కొరకు ఉపయోగించకూడదు. షుగర్ వ్యాధి గ్రస్తులు మాత్రం వారి చక్కెర స్థాయిలను దృష్టిలో ఉంచుకుని కొద్ది పరిమాణంలో మాత్రమే బెల్లాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.
సగ్గు బియ్యం ఉడికిన తరువాత పటిక బెల్లాన్ని పొడిగా చేసి వేసి కలుపుకోవాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బెల్లాన్ని ఉపయోగించే వారు బెల్లాన్ని వేరే గిన్నెలో వేసి కరిగించి ఆ మిశ్రమాన్ని కొద్దిగా ఉడికించాలి. సగ్గు బియ్యం ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం మిశ్రమాన్ని కలపాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న సగ్గు బియ్యం మిశ్రమాన్ని రోజూ ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అధిక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ఇలా తయారు చేసుకున్న సగ్గుబియ్యం పాయసాన్ని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినవచ్చు. పాలను తీసుకోవడం ఇష్టం లేని వారు పాలకు బదులుగా నీటిని ఉపయోగించి జావలాగా చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా సగ్గు బియ్యంతో చేసిన పాయసాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. బరువు తక్కువగా ఉన్నవారు రోజూ ఇలా సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వల్ల చాలా త్వరగా బరువు పెరుగుతారు. క్యాల్షియం, ఐరన్ లోపాలతో బాధపడే వారు ఈ సగ్గుబియ్యం పాయసాన్ని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. సగ్గుబియ్యంలో అధికంగా ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
కనుక అధిక రక్తపోటుతో బాధపడే వారు ఈ విధంగా సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వల్ల చాలా త్వరగా రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. అదే విధంగా నీరసంగా ఉన్నప్పుడు ఇలా సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభించి నీరసం తగ్గుతుంది. జ్వరం, నీళ్ల విరేచనాలతో బాధపడుతున్నప్పుడు సగ్గుబియ్యంతో ఈ విధంగా చేసిన మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుండి సత్వర ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు కూడా ఈ విధంగా సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు క్రమంగా తగ్గు ముఖం పడతాయి.