Sleeping On Stomach : బోర్లా ప‌డుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? 100 రోగాల‌ను 7 రోజుల్లో న‌యం చేసుకోవ‌చ్చు..?

Sleeping On Stomach : మ‌నం రోజూ నిద్రించేట‌ప్పుడు వివిధ భంగిమ‌ల్లో నిద్ర‌పోతూ ఉంటాము. కొందరు నిటారుగా, కొంద‌రు ఎడ‌మ‌వైపు తిరిగి, మ‌రికొంద‌రు కుడివైపు తిరిగి నిద్ర‌పోతూ ఉంటారు. అయితే చాలా త‌క్కువ మంది మాత్రమే బోర్లా ప‌డుకుంటూ ఉంటారు. బోర్లా ప‌డుకోవ‌డం వ‌ల్ల కొంత అసౌక‌ర్యంగా ఉంటుంది. శ్వాస ఆడ‌న‌ట్టుగా ఉండడంతో పాటు పొట్ట ఉన్న‌వారికి ఇలా ప‌డుకోవ‌డం వ‌ల్ల మ‌రింత అసౌక‌ర్యంగా ఉంటుంది. క‌నుక చాలా త‌క్కువ మంది బోర్లా పడుకుంటూ ఉంటారు. అయితే బోర్లా ప‌డుకోవ‌డం వల్ల కొంద‌రికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. బోర్లా ప‌డుకోవ‌డం వ‌ల్ల ఎవ‌రికి మేలు క‌లుగుతుంది…అలాగే బోర్లా పడుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గుర‌క పెట్టే వారు బోర్లా ప‌డుకోవ‌డం వ‌ల్ల ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. నిటారుగా ప‌డుకోవ‌డం వ‌ల్ల కొండ‌నాలుక శ్వాస మార్గానికి అడ్డుప‌డి గుర‌క ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటుంది. బోర్లా ప‌డుకోవ‌డం వ‌ల్ల కొండ‌నాలుక శ్వాస మార్గానికి అడ్డుప‌డ‌కుండా ఉంటుంది. గుర‌క ఎక్కువ‌గా రాకుండా ఉంటుంది. అలాగే అధిక బ‌రువు ఉన్న‌వారు కూడా బోర్లా ప‌డుకోవ‌డం వ‌ల్ల గుర‌క రాకుండా ఉంటుంది. ఊబ‌కాయంతో బాధ‌ప‌డే వారు నిటారుగా ప‌డుకోవ‌డం వ‌ల్ల డ‌యాఫ్రామ్ మీద ఒత్తిడి ప‌డి గుర‌క ఎక్కువ‌గా వ‌స్తుంది. క‌నుక ఊబ‌కాయంతో బాధ‌పడే వారు కూడా బోర్లా ప‌డుకోవ‌డం మంచిది. అయితే పొట్ట ఉన్న వారు ఛాతి కింద దిండును పెట్టుకుని ప‌డుకోవడం మంచిది. అలాగే న‌డుము నొప్పి, డిస్క్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, న‌రాల‌పై ఎక్కువ‌గాఒత్తిడిప‌డే వారు కూడా బోర్లా ప‌డుకోవ‌డం మంచిది.

Sleeping On Stomach many wonderful health benefits
Sleeping On Stomach

ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడే వారు పొట్ట‌కింద దిండు పెట్టుకుని దానిపై బోర్లా ప‌డుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల న‌డుము నొప్పి త‌గ్గి హాయిగా ఉంటుంది. అలాగే కొంద‌రిలో తుంటి భాగంలో ఎముక‌ల‌పై ఒత్తిడి ఎక్కువ‌గా ప‌డి స‌యాటికా నొప్పులు వంటివి వ‌స్తూ ఉంటాయి. అలాంటి వారు అలాగే మెడ నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు కూడా బోర్లా ప‌డుకోవ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అదే విధంగా కొంద‌రిలో ప‌క్కకు తిరిగి ప‌డుకున్న‌ప్పుడు చేతుల‌పై ఒత్తిడి ప‌డి తిమ్మిర్లు ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి. అలాంటి వారు కూడా బోర్లా పడుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ సాఫీగా జ‌రిగి తిమ్మిర్లు రాకుండా ఉంటాయి. ఇటువంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు బోర్లా ప‌డుకోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌ల నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts