Soaked Walnuts : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో వాల్ నట్స్ కూడా ఒకటి. వాల్ నట్స్ చూడడానికి మెదడు ఆకారంలో ఉంటాయి. అలాగే ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వాల్ నట్స్ ను నానబెట్టి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వాల్ నట్స్ లో ఉండే పోషకాలు ఏమిటి.. అలాగే వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాల్ నట్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అంతేకాకుండా వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
మతిమరుపు, అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల కణాల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్ కణాలు దెబ్బతినకుండా కాపాడడంలో సహాయపడతాయి. అలాగే బరువును అదుపులో ఉంచడంలో కూడా వాల్ నట్స్ మనకు సహాయపడతాయి. వీటిలో క్యాలరీలు అదనంగా ఉన్నప్పటికి ప్రోటీన్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే నానబెట్టిన వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది.
ఇక వాల్ నట్స్ లో యాంటీఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అలాగేవీటిలో ఉండే ఫైబర్ ప్రేగు కదలికలను పెంచి జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా వాల్ నట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.