Sompu Ginjala Kashayam : నేటి తరుణంలో మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు వల్ల కలిగే అవస్థ అంతా ఇంతా కాదు. అధిక బరువు వల్ల మనం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లనే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అధిక బరువు వల్ల మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువును తగ్గించే మందులను కూడా వాడుతూ ఉంటారు. అయితే మందులను వాడడం వల్ల బరువు తగ్గినప్పటికి మనం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కనుక మనం సహజ సిద్దంగా బరువును తగ్గించుకోవడం చాలా అవసరం. బరువు తగ్గడంలో మనకు సోంపు గింజలు ఎంతగానో సహాయపడతాయి. సోంపు గింజలను మనం వంటల్లో వాడుతూ ఉంటాం. సోంపు గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటు మనం చాలా సులభంగా బరువు కూడా తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు సోంపు గింజలను వాడడం చాలా సులభం. సోంపు గింజలతో చక్కటి పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు సోంపు గింజలను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ సోంపు గింజలను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని సోంపుతో సహా గిన్నెలో పోసి మరిగించాలి. ఈ నీళ్లు సగం గ్లాస్ అయ్యే వరకు మరిగించిన తరువాత దీనిని గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఈ కషాయం గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో నిమ్మరసం వేసి కలపాలి.
ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. దీనిని క్రమం తప్పకుండా 45 రోజుల పాటు తాగాలి. ఇలా తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ పానీయాన్ని తాగుతూనే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. వంటల్లో నూనెను తక్కువగా ఉపయోగించాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఈ విధంగా సోంపు గింజల నీటిని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. సోంపు గింజల నీటిని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. రక్తం కూడా శుద్ధి అవుతుంది. ఈ విధంగా సోంపు గింజలను వాడడం వల్ల మనం చాలా సులభంగా బరువు కూడా తగ్గవచ్చు.