Cabbage Pesara Pappu Fry : క్యాబేజీ, పెస‌ర‌ప‌ప్పు.. రెండింటినీ క‌లిపి ఇలా ఫ్రై చేయండి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Cabbage Pesara Pappu Fry : మ‌నం క్యాబేజితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. క్యాబేజితో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె మ‌నం క్యాబేజిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలి. క్యాబేజితో మ‌నం ఎక్కువ‌గా చేసుఏ వంట‌కాల్లో క్యాబేజి ఫ్రై కూడా ఒక‌టి. క్యాబేజి ఫ్రై రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ క్యాబేజి ఫ్రైలో మ‌నం పెస‌ర‌ప‌ప్పు వేసి మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పెస‌ర‌ప‌ప్పు వేసి చేసే క్యాబేజి ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఇలా క్యాబేజి ఫ్రైను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. పెస‌ర‌ప‌ప్పు వేసి క్యాబేజి ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాబేజ్ పెస‌ర‌ప‌ప్పు ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క్యాబేజ్ త‌రుగు – అర‌కిలో, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, అర‌గంట పాటు నాన‌బెట్టిన పెస‌ర‌ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, ఉప్పు- త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2.

Cabbage Pesara Pappu Fry recipe in telugu very tasty
Cabbage Pesara Pappu Fry

క్యాబేజ్ పెస‌ర‌ప‌ప్పు ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా జార్ లో అల్లం, కొబ్బ‌రి ముక్క‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత క్యాబేజ్ తురుము, ఉప్పు, ప‌సుపు, పెస‌ర‌ప‌ప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ క్యాబేజిని వేయించాలి. క్యాబేజి పూర్తిగా వేగిన త‌రువాత కారం, మిక్సీ పట్టుకున్న కొబ్బ‌రి మిశ్ర‌మం వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి పెస‌ర‌ప‌ప్పు ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన క్యాబేజిని ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts