హెల్త్ టిప్స్

Sugandhi Pala Verla Podi : దీన్ని తాగితే ర‌క్తం పూర్తిగా శుద్ధి అవుతుంది.. ఏ అనారోగ్యాలు రావు..

Sugandhi Pala Verla Podi : మన శరీరం మొత్తం పనితీరు రక్తసరఫరా మీద ఆధారపడి ఉంటుంది. శరీరలో విష ప‌దార్థాల‌ స్థాయిలు పెరిగినప్పుడు శరీరంలో అవయావాలు నెమ్మదిగా నాశనం మొదలవుతాయి. శరీరంలో అవయవాల‌ పని తీరు కూడా మందగిస్తుంది. రక్తం ఎప్పుడైతే కలుషితం అవుతుందో రోగనిరోధక శక్తి తగ్గడం మొదలవుతుంది. దీని కారణంగా అలర్జీలు, అలసట, తలనొప్పి వంటి సమస్యలు ఆరోగ్యాన్ని మరింత క్షీణించేలా చేస్తాయి.

మన ఆరోగ్యాన్ని నిత్యం కాపాడే రక్తాన్ని శుద్ధి చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు సుగంధపాల వేర్లు అనే పేరు వినే ఉంటారు. ఈ వేర్ల‌తో వేసవిలో షర్బత్‌ల‌ను తయారు చేస్తూ అమ్ముతూ ఉంటారు. ఈ పానీయం ఎక్కువగా రుచిగా ఉంటుందని తాగటానికి అందరూ ఇష్టపడతారు. అంతేకాకుండా ఒంటికి చలువ చేస్తుంద‌ని చెబుతారు. అయితే దీనిలో ఉండే ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. సుగంధ పాలకు రక్తాన్ని శుద్ధి చేసే గుణం అధికంగా ఉంటుంది. సాధారణంగా సుగంధ వేర్లు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతూ ఉంటాయి. దీనిలో నల్ల సుగంధి, ఎర్ర సుగంధి, బర్రె సుగంధి, దేశీయ సుగంధి ఇలా రకరకాలు ఉంటాయి.

Sugandhi Pala Verla Podi can clear your blood

మనలో టీ ప్రేమికులు చాలా మందే ఉంటారు. మరి ఈ సుగంధ పాల వేర్లుతో టీ కషాయం ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్టవ్ పై ఒక గిన్నె పెట్టి గ్లాసు నీరు పోసుకొని దానిలో 5 గ్రాముల సుగంధ పాల వేర్లను పొడి చేసి వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో నాలుగు మిరియాలు, మూడు యాల‌కులు, ఒక ఇంచు అల్లం ముక్క ఈ మూడింటినీ కలిపి కచ్చాపచ్చాగా దంచుకొని ఆ నీటిలో వేయాలి.

ఈ నీటిని మీడియం హీట్ మీద 10 నిమిషాల‌పాటు మరగనివ్వాలి. మరిగిన ఈ నీటిని ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే దానిలో 4 పుదీనా ఆకులు వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకుంటే మీ రక్తాన్ని శుద్ధి చేసే అద్భుతమైన కషాయం రెడీ అయినట్లే. ఈ కషాయాన్ని ప్రతి రోజూ తాగడం ద్వారా మీ శరీరంలోని విషపదార్థాలు బయటకు పోయి రక్తం శుద్ధి అవుతుంది. దీంతో అల‌ర్జీలు త‌గ్గుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇత‌ర అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉంటారు.

Admin

Recent Posts