వినోదం

Chiranjeevi : చిరంజీవి ఇంట్లో షూటింగ్ జరుపుకున్న బాలకృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రం ఏదో తెలుసా..?

Chiranjeevi : తెలుగు చిత్రసీమలో బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. ప్రస్తుతం బాలకృష్ణ ఇటు సినిమాలోతోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. అఖండ చిత్రంతో సక్సెస్ ను అందుకున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేతిలో ఇప్పుడు బోలెడు ప్రాజెక్టులు వచ్చిపడ్డాయి. అఖండ చిత్రం సక్సెస్ కావడంతో త‌రువాతి సినిమాల‌పై అందరి దృష్టి పడింది. అఖండ సినిమాతో బాలకృష్ణ మార్కెట్ పెరిగినట్టే.

ఇలా బాలకృష్ణ కెరీర్లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. అందులో ఒక చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఇద్దరు భామల మధ్య నలుగుతున్న ముద్దుల బావగా బాలకృష్ణ ఈ చిత్రంలో ఎంతో అద్భుతమైన నటనను కనబరిచారు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1990లో యువరత్న ఆర్ట్స్ బ్యానర్ పై విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా శోభన మరియు నిరోషా హీరోయిన్స్ గా నటించారు. ఇరువురి బామల కౌగిలిలో అనే పాట ఇప్పటికీ మనం ఏదో చోట వింటూనే ఉంటాం. కెవి మహదేవన్ అంత అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఈ చిత్రానికి.

this balakrishna film making done in chiranjeevi home

యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ కు ఈ చిత్రంతో ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేయగలరు అనే గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో బాలకృష్ణకు అత్తగా శారద నటించారు. వీరిద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరించిన ఈ చిత్రం అప్పట్లో ఒక స్టార్ హీరో ఇంట్లో కొన్ని సన్నివేశాలు తీయడం జరిగింది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.

చిరంజీవికి తమిళనాడులోని వెలచేరి అనే గ్రామంలో హనీ హౌస్ అనే గెస్ట్ హౌస్ మరియు దాని పక్కనే రెండు ఎకరాల ఖాళీ స్థలం ఉన్నాయి. ఈ సినిమాలో అత్త శారద‌ ఇంటి పక్కన బాలకృష్ణ ఒక పూరి గుడిసెలో ఉంటారు. ఆ పూరి గుడిసెను కూడా చిరంజీవి స్థలంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇదే కాకుండా పొలంలో జరిగే సన్నివేశాలకు బంధించిన స్థలం కూడా చిరంజీవిదే. అప్పట్లో ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలు చిరంజీవి ఇంట్లో చిత్రీకరించడం జరిగింది.

Admin

Recent Posts