Cloves : రాత్రి ప‌డుకునే ముందు 2 ల‌వంగాల‌ను తిని గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగితే.. ఏమవుతుందో తెలుసా ?

Cloves : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో ల‌వంగాలు కూడా ఒక‌టి. ఎంతో కాలం నుండి మ‌నం వీటిని వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నాం. ముఖ్యంగా నాన్ వెజ్ వంట‌కాల్లో వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. వంట‌ల్లో ల‌వంగాల‌ను వేయ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంట‌లు రుచితోపాటు చ‌క్క‌టి వాస‌న‌ను కూడా క‌లిగి ఉంటాయి. సుగంధ ద్ర‌వ్యాల్లో ఒక‌టైన ల‌వంగాల‌ను వంట‌ల్లోనే కాకుండా కొన్ని ప్ర‌త్యేక‌మైన కాస్మోటిక్స్ త‌యారీలో, ఔష‌ధాల త‌యారీలో కూడా ఉప‌యోగిస్తారు. ల‌వంగాలలో కూడా ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

నోటి దుర్వాస‌న‌ను త‌గ్గించ‌డం ద‌గ్గ‌రి నుండి కొన్ని కోట్లు పెట్టినా త‌గ్గ‌ని వ్యాధుల వ‌ర‌కు వీటిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. ల‌వంగాల‌లో ఔష‌ధ గుణాల‌తోపాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు కూడా ఉన్నాయి. ప్ర‌తిరోజూ ఉద‌యం లేదా రాత్రి ప‌డుకునే ముందు 2 ల‌వంగాల‌ను తిని గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ల‌వంగాల‌ను ఈ విధంగా తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ల‌వంగాలను ఈ విధంగా తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయం శుభ్ర‌ప‌డడంతోపాటు కాలేయం ప‌ని తీరు మెరుగుప‌డుతుంది.

take 2 Cloves at night and drink warm water for these benefits
Cloves

జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారికి ల‌వంగాలు చ‌క్క‌టి ఔష‌ధంలా పని చేస్తాయి. ల‌వంగాల‌ను నేరుగా తిన‌డం లేదా నీటిలో వేసి క‌షాయంలా చేసుకుని తాగ‌డం వ‌ల్ల అజీర్తి, గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ప్రేగుల్లో ఉండే మలినాలు తొల‌గిపోయి ప్రేగులు శుభ్ర‌ప‌డ‌తాయి. జీర్ణ శ‌క్తి పెరుగుతుంది. ల‌వంగాలు యాంటీ క్యాన్సర్ ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. ల‌వంగాల‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి శ‌రీరంలోని ఫ్రీ రాడిక‌ల్స్ ను తొల‌గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. దీంతో మ‌నం క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

నోటి దుర్వాస‌న‌, చిగుళ్ల నుండి ర‌క్తం కార‌డం, చిగుళ్ల వాపు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ల‌వంగాల‌ను తిన‌డం వ‌ల్ల లేదా వాటితో చేసిన క‌షాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించ‌డం వ‌ల్ల ఆయా దంత సంబంధిత స‌మ‌స్య‌ల నుండి కూడా ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ల‌వంగం నూనెలో దూదిని ముంచి పిప్పి ప‌న్నుపై ఉంచ‌డం వ‌ల్ల పిప్పి ప‌న్ను వ‌ల్ల క‌లిగే నొప్పి త‌గ్గుతుంది. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ల‌వంగాలను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో షుగ‌ర్ వ్యాధి కూడా నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

ల‌వంగాల్లో అధికంగా ఉండే క్యాల్షియం ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న వారు ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌ని ఫ‌లితం ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల లేదా వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి మెరుగుప‌డి బ్యాక్టీరియా, వైర‌స్ ల వ‌ల్ల క‌లిగే ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. కొంద‌రిలో దూర ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులు అవుతూ ఉంటాయి. అలాంటి వారు ప్ర‌యాణం చేయ‌డానికి ముందు రెండు ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది.

జులుబు, ద‌గ్గు వంటి వాటితో బాధ‌ప‌డే వారు రోజులో మూడు నుండి 4 ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు నుండి స‌త్వ‌ర ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. త‌ర‌చూ త‌ల‌నొప్పితో బాధ‌ప‌డే వారు ల‌వంగాల‌ను తిన‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. అలాగే పాల‌లో చిటికెడు ల‌వంగాల పొడిని వేసి తాగ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి త్వ‌ర‌గా త‌గ్గుతుంది. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు క‌రిగిపోయి త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు కూడా ద‌రి చేర‌కుండా ఉంటాయి.

మ‌ద్య‌పాసం అల‌వాటు ఉన్న వారు రెండు ల‌వంగాల‌ను నోట్లో పెట్టుకుని చ‌ప్ప‌రిస్తూ ఉండ‌డం వ‌ల్ల మ‌ద్యం తాగాల‌నే కోరిక క‌ల‌గ‌కుండా ఉంటుంది. చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో కూడా ల‌వంగాలు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మొటిమ‌ల‌తో బాధ‌ప‌డే వారు ల‌వంగాల‌ను పేస్ట్ గా చేసి మొటిమ‌ల‌పై రాయ‌డం వ‌ల్ల మొటిమ‌లు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. ఈ విధంగా ల‌వంగాల‌ను పేస్ట్ గా చేసి చ‌ర్మంపై రాయ‌డం వ‌ల్ల తామ‌ర, గ‌జ్జి వంటి చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఈ విధంగా ల‌వంగాలు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయని వీటిని త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts