Maida Pindi Burfi : కేవ‌లం 10 నిమిషాల్లోనే సింపుల్‌గా చేసుకోగ‌లిగే స్వీట్ ఇది..!

Maida Pindi Burfi : మ‌నం అప్పుడ‌ప్పుడూ మైదా పిండితో వివిధ ర‌కాల ప‌దార్థాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాం. మైదా పిండితో చేసుకోద‌గిన ప‌దార్థాల్లో మైదా పిండి బ‌ర్ఫీ కూడా ఒక‌టి. ఇది చాలా రుచిగా ఉంటుంది. వంట రాని వారు కూడా దీనిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మైదా పిండితో ఎంతో రుచిగా ఉండే బ‌ర్ఫీని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మైదా పిండి బ‌ర్ఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదా పిండి – ఒక క‌ప్పు, నెయ్యి – పావు క‌ప్పు కంటే కొద్దిగా ఎక్కువ‌, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, పంచ‌దార పొడి – ముప్పావు క‌ప్పు.

Maida Pindi Burfi very easy and simple to make this sweet
Maida Pindi Burfi

మైదా పిండి బ‌ర్ఫీ త‌యారీ విధానం..

ముందుగా స్ట‌వ్ మీద క‌ళాయిని ఉంచి వేడి చేయాలి. క‌ళాయి వేడ‌య్యాక అందులో మైదా పిండిని వేసి చిన్న మంట‌పై 2 నుండి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. త‌రువాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి క‌లుపుకోవాలి. మ‌ర‌లా 5 నిమిషాల త‌రువాత మ‌రో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి క‌లుపుకోవాలి. ఇలా 5 నిమిషాల‌కొక‌సారి నెయ్యంతా వేసి ఉండలు లేకుండా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత యాల‌కుల పొడిని చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పంచ‌దార పొడిని వేసి గంటెతో క‌లుపుకోవాలి.

ఈ మిశ్ర‌మం కొద్దిగా చ‌ల్లారి గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత చేత్తో అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని రెండు భాగాలుగా చేయాలి. ఒక భాగంలో మ‌న‌కు న‌చ్చిన ఫుడ్ క‌ల‌ర్ ను వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దానికి లోప‌ల భాగంలో నెయ్యిని రాయాలి. త‌రువాత దానిలో బ‌ట‌ర్ పేప‌ర్ ను ఉంచి దానిపై కూడా నెయ్యిని రాయాలి. ఇప్పుడు ఫుడ్ క‌ల‌ర్ క‌ల‌ప‌ని మిశ్ర‌మాన్ని ఉంచి అంతా స‌మానంగా వ‌చ్చేలా వ‌త్తుకోవాలి.

త‌రువాత క‌ల‌ర్ వేసి క‌లిపిన మిశ్ర‌మాన్ని ఉంచి స‌మానంగా వ‌చ్చేలా క‌లుపుకోవాలి. దీనిపై కొద్దిగా బాదంప‌ప్పు ప‌లుకుల‌ను చ‌ల్లి కొద్దిగా లోపలికి వెళ్లేలా వ‌త్తుకోవాలి. ఇప్పుడు గిన్నెపై మూత‌ను ఉంచి అర గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. అర గంట త‌రువాత గిన్నెను బ‌య‌ట‌కు తీసి క‌త్తితో అంచుల‌ను గిన్నె నుండి వేరు చేయాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని గిన్నె నుండి బ‌య‌ట‌కు తీసి పైన ఉండే బ‌ట‌ర్ పేపర్ ను తీసేయాలి. త‌రువాత దీనిని మ‌న‌కు కావ‌ల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నోట్లో వేసుకోగానే క‌రిగిపోయేంత రుచిగా ఉండే మైడా పిండి బ‌ర్ఫీ త‌యార‌వుతుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా మైదా పిండితో రుచిగా బ‌ర్ఫీని చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts