Anjeer : అంజీర్ పండ్లు మనకు రెండు విధాలుగా లభ్యమవుతాయి. వీటిని నేరుగా పండ్ల రూపంలో తినవచ్చు. లేదా డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ తినవచ్చు. మనకు డ్రై ఫ్రూట్స్ అయితేనే విరివిగా లభిస్తాయి. పైగా వీటిని తినడం చాలా తేలిక. అయితే అంజీర్‌ను కింద తెలిపిన విధంగా తిన్నారంటే.. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి అందుకు అంజీర్‌ను ఏ విధంగా తినాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. కాల్షియం లోపం సమస్యతో బాధపడుతున్నవారు, మూత్రంలో బాగా కాల్షియం పోతున్న వారు రోజుకు 3 అంజీర్ పండ్లను తింటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.
2. అంజీర్ పండ్లను 3 తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌తో వాటిని తీసుకోవాలి. ఈ విధంగా రోజూ తింటుంటే యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. చర్మం కాంతివంతంగా మారుతుంది. మెరుస్తుంది.
3. అజీర్ణం సమస్య ఉన్నవారు, ఆకలి లేని వారు రాత్రి పూట 2 అంజీర్ పండ్లను తినాలి. ఇలా రోజూ చేస్తుంటే వారం రోజుల్లో సమస్య పోతుంది.
4. తరచూ అంజీర్ పండ్లను తింటుంటే అధిక బరువు తగ్గుతారు. అందుకు గాను వీటిని ఉదయం తీసుకోవాలి. రాత్రి నీటిలో 4 అంజీర్ పండ్లను నానబెట్టి మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో వీటిని తీసుకోవాలి. దీంతో అధిక బరువు త్వరగా తగ్గుతారు.
5. అంజీర్ పండ్లను రోజుకు 2 తినడం వల్ల వృద్ధుల్లో కంటి చూపు పెరుగుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి.
6. అంజీర్ పండ్లలో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను బయటకు పంపుతుంది. దీంతో హార్ఠ్ ఎటాక్‌లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
7. ఆస్తమా, దగ్గు సమస్యలు ఉన్నవారు అంజీర్ పండ్లను తింటే వెంటనే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ పండ్లలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది.
8. అంజీర్ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో గుండె జబ్బులు రావు. రోజుకు 3 అంజీర్ పండ్లను తింటే ఈ ప్రయోజనాలు కలుగుతాయి.
9. బరువు పెరగాలని అనుకునే వారు అంజీర్ పండ్లను రాత్రి పూట పాలతో తినాలి. రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగుతూ అంజీర్ పండ్లు 2 లేదా 3 తినాలి. ఇలా చేస్తుంటే బరువు పెరుగుతారు.
10. మలబద్దకం ఉన్నవారు ముందు రోజు రాత్రి 2 అంజీర్ పండ్లను తినాలి. దీంతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే అంజీర్ పండ్లను రోజూ తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కణాలు పెరగవు. అంజీర్ పండ్లను తినడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది.