Priya Prakash Varrier : ఒకే ఒక కన్నుగీటిన వీడియో ద్వారా రాత్రికి రాత్రే నేషనల్ క్రష్‌గా మారిన ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒరు అదార్ లవ్ అనే మూవీలో ఆమె ఆ విధంగా కనిపించింది. అయితే ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. తరువాత ఈమెకు పలు చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ ఒక్కటి కూడా హిట్ కాలేదు. దీంతో తన కెరీర్‌లో ఓ మంచి హిట్ చిత్రం కోసం ఈ అమ్మడు ఎంతగానో ఎదురు చూస్తోంది.
ఇక సోషల్ మీడియాలోనూ ప్రియా ప్రకాష్ వారియర్ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇతర హీరోయిన్స్ మాదిరిగానే ఈమె కూడా అందాలను ఆరబోస్తూ గ్లామర్ షో చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన పింక్ కలర్ డ్రెస్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఆ డ్రెస్‌లో ప్రియా ప్రకాష్ వారియర్ మెరిసిపోతోంది. ఈ క్రమంలోనే ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం విష్ణు ప్రియ అనే కన్నడ సినిమాతోపాటు ఒరు నాల్‌పతుకరంతె ఇరుపతోన్నుకారి అనే మళయాళం మూవీలో నటిస్తోంది. అలాగే శ్రీదేవి బంగ్లా అనే మరో హిందీ మూవీలోనూ నటిస్తోంది. మరి ఈ మూవీలు అయినా ఆమెకు మంచి గుర్తింపును తెస్తాయో, లేదో.. చూడాలి.