హెల్త్ టిప్స్

Coffee Smoothie Recipe : కాఫీ స్మూతీని ఇలా చేసి తీసుకోండి.. ఒత్తిడి, ఆందోళ‌న మాయ‌మ‌వుతాయి..!

Coffee Smoothie Recipe : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. ఉద్యోగాల కారణంగా, ఒత్తిడి ఎక్కువ అవుతోంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లయితే, రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒత్తిడి బాగా ఎక్కువగా ఉన్నట్లయితే, కోపంతో పాటుగా యాంగ్జైటీ, మూడ్ స్వింగ్స్ లో మార్పు ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే, ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేయడం మంచిది. రోజూ, ఇలా మీరు తయారు చేసుకుని తీసుకున్నట్లయితే, ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఒత్తిడి సమస్య నుండి ఈజీగా బయటకి వచ్చేయచ్చు. ఇక మరి ఒత్తిడి తగ్గాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని చూసేద్దాం.

ఒత్తిడిని నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే, డిప్రెషన్ సమస్యను ఎదుర్కోవాలి. ఒత్తిడి తగ్గాలంటే, కాఫీ స్మూతీని తీసుకోండి. ఈ స్మూతీ తో ఒత్తిడిని ఈజీగా తొలగించుకోవచ్చు. ఒత్తిడి నుండి ఈజీగా బయటపడవచ్చు. మరి, ఇక ఈ స్మూతీ ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముందు ఒక బౌల్ తీసుకొని, అందులో మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఓట్స్ లో వాటర్ వేసి, అరగంట పాటు నానబెట్టుకోండి.

take coffee smoothie in this way your stress will be relieved

తర్వాత వాటర్ ని తీసేసి, ఓట్స్ ని పక్కన పెట్టుకొని, ఒక బ్లెండర్ ని తీసుకుని, ఒక టేబుల్ స్పూన్ వరకు ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ని వేయండి. నానబెట్టుకున్న జీడిపప్పుని, నానబెట్టుకున్న ఓట్స్ ని, ఒక టేబుల్ స్పూన్ పీనట్ బట్టర్ని వేసుకోండి. రెండు గింజలు తీసేసిన ఖర్జూరాన్ని కూడా వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు, చియా సీడ్స్ ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి, మెత్తగా గ్రైండ్ చేసుకోండి.

ఇలా, కాఫీ ఓట్స్ స్మూతీ తయారవుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు, ఈ స్మూతీని తీసుకుంటే త్వరగా రికవరీ అవ్వచ్చు. మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ప్రశాంతతని పొందవచ్చు. ఏకాగ్రత కూడా రెట్టింపు అవుతుంది. డిప్రెషన్ ఉన్న వాళ్ళు, ఈ స్మూతీని తీసుకుంటే చాలా ఈజీగా బయటపడొచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఈ స్మూతీని తీసుకోవచ్చు. రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ లో దీన్ని తీసుకున్నట్లయితే, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి వేయకుండా ఉంటుంది.

Admin

Recent Posts